అన్వేషించండి

NEET-UG Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే

NEET Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు మొదటివారంలో ప్రారంభంకానుంది. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు కేంద్రీయ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మెర్‌లోని సీట్లను భర్తీచేయనున్నారు.

NEET-UG Counselling Schedule 2024: దేశంలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటివారంలో ప్రారంభంకానుంది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్(NMC) ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) జులై 29న ఒక ప్రకటనలో తెలిపింది. తాజా సమాచారం కోసం ఎంసీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మెర్‌లోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను ఎంసీసీ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 710 వైద్య కళాశాలల్లోని సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే 21,000 బీడీఎస్‌ సీట్లతోపాటు ఆయుష్‌, నర్సింగ్‌ సీట్లను భర్తీచేయనున్నారు. పేపర్‌ లీక్‌ నేపథ్యంలో ఈ సారి నీట్‌ యూజీ పరీక్ష వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తుది ఫలితాలను ప్రకటించింది. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించింది.

➥ నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి తొలిదశ కౌన్సెలింగ్ కోసం ఆగస్టు 14 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 23న సీట్ల ఎంపిక ఫలితాలను వెల్లడిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 24 నుంచి 29లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 

➥ రెండోదశ సీట్ల భర్తీకి సెప్టెంబరు 5న రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. సెప్టెంబరు 13న సీట్లకు ఎంపికైన వారి ఫలితాలను వెల్లడిస్తారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 14 నుంచి 20లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 

➥ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబరు 16 నుంచి 20 వరకు కొనసాగనుంది. అక్టోబరు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు అక్టోబరు 24 నుంచి 30లోపు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. 

అర్హులెవరు..?
నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో 50 శాతం మార్కులు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవడానికి అర్హులు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉత్తీర్ణత శాతంలో సడలింపు పొందుతారు. దివ్యాంగులకు 40 శాతం మార్కులు, అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు, ESIC, AFMC, BHU, AMU సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

కౌన్సెలింగ్‌కు కాళోజీ వర్సిటీ ఏర్పాట్లు..
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటనతో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ర్యాంకుల ఆధారంగా.. కౌన్సెలింగ్ తేదీలను వర్సిటీ ఖరారు చేయనుంది. ఈమేరకు రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. తెలంగాణలో మొత్తం 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 30 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 8,490 సీట్లు ఉన్నాయి. వీటిలో 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటాలో భర్తీ చేయనున్నారు. మిగిలిన సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేస్తారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రతిపాదనలు ఎన్‌ఎంసీ అనుమతికి పరిశీలనలో ఉన్నాయి. అనుమతి వస్తే.. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. 

NEET-UG Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Fake 500 Notes: 500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
Pope Francis Facts: పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Fake 500 Notes: 500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
Pope Francis Facts: పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
Singer Pravasthi: నన్ను మెంటల్‌గా టార్చర్ చేశారు - కీరవాణి, చంద్రబోస్, సునీతలపై యంగ్ సింగర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
నన్ను మెంటల్‌గా టార్చర్ చేశారు - కీరవాణి, చంద్రబోస్, సునీతలపై యంగ్ సింగర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
Balakrishna: కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
Pope Francis: పోప్ మరణాన్ని ఎవరు నిర్ధారిస్తారు? అంత్యక్రియలు ఎప్పుడు, ఎలా చేస్తారు?
పోప్ మరణాన్ని ఎవరు నిర్ధారిస్తారు? అంత్యక్రియలు ఎప్పుడు, ఎలా చేస్తారు?
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Embed widget