అన్వేషించండి

NEET PG 2024 Date: నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?

NEET PG Exam: దేశంలోని మెడికల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ పీజీ 2024 ప్రవేశ పరీక్ష తేదీని 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్' ప్రకటించింది.

NEET PG 2024 Exam: దేశంలోని మెడికల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (NEET PG) - 2024 పరీక్ష షెడ్యూలు వెలువడింది. ఈ మేరకు 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ (NBEMS)' జులై 5న ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 11న నీట్ పీజీ (NEET PG-2024) ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇక పీజీ అర్హత సాధించడానికి కటాఫ్ గడువును ఆగస్టు 15గా నిర్ణయించారు. 

నీట్ పీజీ పరీక్ష విధానం..
నీట్ పీజీ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.

'టైమ్-బౌండ్ సెక్షన్' విధానం అమలు..
నీట్ పీజీ పరీక్ష(NEET PG 2024)లో ఈసారి నుంచి 'టైమ్-బౌండ్ సెక్షన్ (Time Bound Sections)' విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. టైమ్‌ బౌండ్‌ సెక్షన్స్‌ విధానంలో పరీక్షలో సెక్షన్ల వారీగా సమయాన్ని కేటాయించడం. దీనిప్రకారం క్వశ్చన్ పేపర్‌ను సెక్షన్ల వారీగా విభజించి.. ప్రతి సెక్షన్‌కు కొంత సమయం కేటాయిస్తారు. ఆ సెక్షన్‌ను ఇచ్చిన సమయంలో పూర్తిచేసిన తర్వాతనే తర్వాతి సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. మల్టిపుల్‌ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించే నీట్‌ పీజీతో పాటు NBEMS నిర్వహించే ఇతర పరీక్షల సమయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సెక్యూరిటీ, ప్రాముఖ్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

'టైమ్-బౌండ్ సెక్షన్' పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

అర్హత మార్కులు: నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్(PwD) అభ్యర్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (PwD కలిపి) అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: నీట్ పీజీ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా మొత్తం 259 నగరాల్లో నిర్వహించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 34 నగరాలు/పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అమలాపురం, అమరావతి, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, కావలి, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, నంద్యాల, నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, రాజంపేట, సత్తుపల్లి, సిద్ధిపేట, సూరంపాలెం, సూర్యాపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

దేశంలోని వైద్య కళాశాలల్లో పీజీ కోర్సుల్లో (PG Medical Courses) ప్రవేశాలకు ఏప్రిల్ 16న నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌(NBEMS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 16 నుంచి మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల సవరణకు ఏప్రిల్ 10 నుంచి 16 వరకు అవకాశం కల్పించింది. ఇక మే 28 నుంచి జూన్ 13 వరకు, జూన్ 7 నుంచి 10 వరకు దరఖాస్తుల సవరణకు తుది అవకాశం కల్పించింది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 23న పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. పరీక్షను వాయిదావేసింది. తాజాగా పరీక్ష తేదీని ఎన్‌బీఈఎంఎస్ విడుదల చేసింది.

NEET PG 2024 Date: నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Daaku Maharaj Collection Day 1: 'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
Hyderabad Drugs: పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
India HMPV Cases: భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు, ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే
భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు, ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Embed widget