By: ABP Desam | Updated at : 08 Feb 2023 09:18 AM (IST)
Edited By: omeprakash
నీట్ పీజీ ఫేక్ నోటిఫికేషన్
పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష- 2023 తేదీని మార్చాలంటూ డిమాండ్లు వస్తోన్న వేళ ఆ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టుగా జరుగుతోన్న దుష్ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. అదంతా దుష్ప్రచారమేనని.. ఎవరూ నమ్మొద్దని స్పష్టంచేసింది. మార్చి 5న జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో మార్పులు జరిగాయని.. మే 21కి మార్పు చేసినట్టు పేర్కొన్న ఆ నోట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. నీట్ పీజీ 2023 పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సందేశం సర్క్యులేట్ అవుతోంది. అది ఫేక్ సందేశం. ఇలాంటి నకిలీ సందేశాలను ఇతరులకు షేర్ చేయొద్దు అని ట్విటర్‌లో కోరింది.
A notice issued in the name of the National Board of Examinations claims that the NEET-PG 2023 exam has been postponed & will now be conducted on 21st May 2023.#PIBFactCheck
▶️This Notice is #Fake.
▶️For updates related to NEET-PG visit https://t.co/itDmxfsijS pic.twitter.com/3piCLWnad8— PIB Fact Check (@PIBFactCheck) February 7, 2023
నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆందోళనలు...
ఇంకోవైపు, నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ బృందంతో పాటు నీట్ పీజీ ఆశావహులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 7న నిరసనకు దిగారు. నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 5న కాకుండా మే లేదా జూన్ నెలల్లో పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు చదువుకొనేందుకు సమయం దొరకడంతో పాటు ఎలిజిబిలిటీ విషయంలో ఇంటర్న్‌షిప్‌లో ఉన్నవారికి లబ్ది చేకూరుతుందని వైద్య సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. అందువల్ల తక్షణమే ఈ పరీక్షను వాయిదా వేసి భారీ సంఖ్యలో అభ్యర్థులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేయాలని ఇతర వైద్య సంఘాలు సైతం ముందుకు రావాలని, ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ఇప్పటికే అసోసియేషన్ బృందం విజ్ఞప్తి చేసింది.
Also Read:
బిట్‌శాట్- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్షలు, జూన్ 18 నుంచి 22 వరకు సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రవేశ ప్రకటన, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
JEE Advanced 2023: జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
Sainik School Admissions: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!