అన్వేషించండి

JEE Main Results: నేడే జేఈఈ మెయిన్‌ సెషన్-1 ఫలితాలు, ఫైనల్ కీ వెల్లడి

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాల వెల్లడికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఫిబ్రవరి 12న ఫైనల్ కీతోపాటు ఫలితాలను వెల్లడించనుంది.

JEE Main Result 2024: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాల వెల్లడికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్‌-1 పరీక్షల ఫలితాలను నేడు(ఫిబ్రవరి 12న) వెల్లడించనుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ ఆన్సర్ కీని విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాల వెల్లడికి సిద్ధమైంది. ఫలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.

ఇక జేఈఈ మెయిన్ సెషన్‌-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 2న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే  రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నారు. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్‌ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ తెలిపింది. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు. 

జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది రెండు విడతలకు కలిపి 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

అర్హతలు..

➥ బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తోపాట కెమిస్ట్రీ/బయాలజీ/బయోటెక్నాలజీ/ సాంకేతిక వృత్తిపరమైన సబ్జెక్టుల్లో ఏదైనా  కలిగి ఉండాలి. 

➥ బీఆర్క్ కోర్సలకు ప్రవేశాలు కోరేవారు ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆప్షనల్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.  (లేదా) పదో తరగతితోపాటు మూడేళ్ల డిప్లొమా (మ్యాథమెటిక్స్) ఉండాలి.

➥ ఇక బీప్లానింగ్‌కు తప్పనిసరి సబ్జెక్టుతోపాటు గణితం కూడా ఉండాలి.

➥ ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం ఉండాాలి.

JEE (Main) - 2023 Notification

Eligibility Criteria

Online Application

Official Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth in National Herald case:ఈడీ చిక్కుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి- విమర్శలు మొదలు పెట్టిన కేటీఆర్ 
ఈడీ చిక్కుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి- విమర్శలు మొదలు పెట్టిన కేటీఆర్ 
YS Jagan on Amaravti: మూడు రాజధానులకు మంగళం..   అమరావతిపై జగన్ దిగొచ్చారా.?
మూడు రాజధానులకు మంగళం..   అమరావతిపై జగన్ దిగొచ్చారా.?
Kavitha Letter:  బీఆర్‌ఎస్‌ కేడర్‌ అభిప్రాయం ముందే చెప్పిన ఏబీపీ దేశం- ఆ స్టోరీలోని అంశాలే లేఖలో పేర్కొన్న కవిత
బీఆర్‌ఎస్‌ కేడర్‌ అభిప్రాయం ముందే చెప్పిన ఏబీపీ దేశం- ఆ స్టోరీలోని అంశాలే లేఖలో పేర్కొన్న కవిత
BRS Blow Out:  మైడియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు కవిత లేఖ - ఆరు పేజీల్లో తీవ్ర అసంతృప్తి- పార్టీలో గొడవలు నిజమే !
మైడియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు కవిత లేఖ - ఆరు పేజీల్లో తీవ్ర అసంతృప్తి- పార్టీలో గొడవలు నిజమే !
Advertisement

వీడియోలు

RCB vs SRH Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ ఢీAkash Maharaj Singh Tributes Digvesh rathi | బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసి దిగ్వేష్ కి ట్రిబ్యూట్ ఇచ్చిన ఆకాశ్GT vs LSG Match Highlights IPL 2025 | సంజీవ్ గోయెంకా సపోర్ట్ రిజల్ట్ ఇచ్చిందా..?Mitchell Marsh 117 Runs vs GT IPL 2025 | 15ఏళ్ల కెరీర్ తర్వాత ఐపీఎల్ లో సెంచరీ కొట్టిన మిచ్ మార్ష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth in National Herald case:ఈడీ చిక్కుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి- విమర్శలు మొదలు పెట్టిన కేటీఆర్ 
ఈడీ చిక్కుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి- విమర్శలు మొదలు పెట్టిన కేటీఆర్ 
YS Jagan on Amaravti: మూడు రాజధానులకు మంగళం..   అమరావతిపై జగన్ దిగొచ్చారా.?
మూడు రాజధానులకు మంగళం..   అమరావతిపై జగన్ దిగొచ్చారా.?
Kavitha Letter:  బీఆర్‌ఎస్‌ కేడర్‌ అభిప్రాయం ముందే చెప్పిన ఏబీపీ దేశం- ఆ స్టోరీలోని అంశాలే లేఖలో పేర్కొన్న కవిత
బీఆర్‌ఎస్‌ కేడర్‌ అభిప్రాయం ముందే చెప్పిన ఏబీపీ దేశం- ఆ స్టోరీలోని అంశాలే లేఖలో పేర్కొన్న కవిత
BRS Blow Out:  మైడియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు కవిత లేఖ - ఆరు పేజీల్లో తీవ్ర అసంతృప్తి- పార్టీలో గొడవలు నిజమే !
మైడియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు కవిత లేఖ - ఆరు పేజీల్లో తీవ్ర అసంతృప్తి- పార్టీలో గొడవలు నిజమే !
Anakapalle Crime : అనకాపల్లిలో ఉండి ఆమెరికా ప్రజల దగ్గర వేల డాలర్లు కొట్టేశారు- 33 మంది ముఠా అరెస్ట్
అనకాపల్లిలో ఉండి ఆమెరికా ప్రజల దగ్గర వేల డాలర్లు కొట్టేశారు- 33 మంది ముఠా అరెస్ట్
YS Jagan : YS జగన్ నోట మళ్లీ అమరావతి మాట - వైసీపీ ప్లాన్ ఏంటీ?
YS జగన్ నోట మళ్లీ అమరావతి మాట - వైసీపీ ప్లాన్ ఏంటీ?
Latest Weather Update: మరో గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ- తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు
 మరో గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ- తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు
Rukmini Vasanth: త్రివిక్రమ్ దర్శకత్వంలో రుక్మిణి... వెంకటేష్‌కు జంటగా!?
త్రివిక్రమ్ దర్శకత్వంలో రుక్మిణి... వెంకటేష్‌కు జంటగా!?
Embed widget