CUET UG Result: సీయూఈటీ యూజీ - 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీయూఈటీ-యూజీ - 2023 ఫలితాలు విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) 2023’ ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టి్ంగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జులై 15న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
సీయూఈటీ యూజీ-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మే నెలలో జరిగిన పరీక్షకు సుమారు 14 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 6.52 లక్షల మంది బాలికలు కాగా, 7.48 లక్షల మంది బాలురు ఉన్నారు. ప్రైవేట్, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు సైతం డిగ్రీ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు.
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరవచ్చు. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించవచ్చు.
దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 21 నుంచి జూన్ 23 వరకు 13 బాషల్లో, తొమ్మిది దశల్లో నిర్వహించగా.. దేశవ్యాప్తంగా 387 నగరాలు, విదేశాల్లోని 24 నగరాల్లో దాదాపు 14.90లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జులై 15న సీయూఈటీ (యూజీ) ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ జులై 12న విడుదలైన సంగతి తెలిసిందే. అంతకుముందు పరీక్ష ప్రాథమిక కీని ఏప్రిల్ 29న విడుదలచేసి, ఆన్సర్ కీపై జూన్ 29 నుంచి జులై 1 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తాజాగా తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది. తాజాగా ఫలితాలను విడుదల చేసింది.
ALSO READ:
నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
నీట్ యూజీ (NEET UG) 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, సెంట్రల్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి 100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సులు, వివరాలు ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్ఏహెచ్‌పీసీ) 2023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial