అన్వేషించండి

APSAHPC: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సులు, వివరాలు ఇలా!

ఏపీఎస్ఏహెచ్‌పీసీ 023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్ఏహెచ్‌పీసీ) 2023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

కాలేజీలు- జిల్లాలు..
ఏపీలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు, జిల్లాల్లోని పలు ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో వివిధ పారామెడికల్‌ కోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్‌) దరఖాస్తు చేసుకోవాలి. 

ప్రభుత్వ కళాశాలలు... వాటి పరిధిలోకి వచ్చే జిల్లాలు

⏩ ఆంధ్ర మెడికల్‌ కాలేజీ, విశాఖపట్నం: విజయనగరం, విశాఖపట్నం

⏩ రంగరాయ మెడికల్‌ కాలేజీ, కాకినాడ: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి

⏩ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, విజయవాడ: కృష్ణా

⏩ గుంటూరు మెడికల్‌ కాలేజీ: గుంటూరు, ప్రకాశం

⏩ ఎస్వీ మెడికల్‌ కాలేజీ, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు

⏩ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, కడప: వైఎస్‌ఆర్‌ కడప

⏩ కర్నూలు మెడికల్‌ కాలేజీ: కర్నూలు

⏩ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, అనంతపురం: అనంతపురం

⏩ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, శ్రీకాకుళం: శ్రీకాకుళం 

సీట్లు: తొమ్మిది గవర్నమెంట్‌ కాలేజీల్లో వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో మొత్తం 1053 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలోకి వచ్చే జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే వివిధ జిల్లాల్లో ప్రైవేటు పారామెడికల్‌ కాలేజీలు ఉండగా.. వాటిలో 17,254 పారా మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మొత్తం 18,307 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అందిస్తున్న కోర్సులు..

⏩  డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ(డీఎంఎల్‌టీ)

⏩  డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ(డీఎంఐటీ)

⏩  డిప్లొమా ఇన్‌ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌(డీఓఏ)

⏩ డిప్లొమా ఇన్‌ డయాలసిస్‌ టెక్నాలజీ(డీడీఐఏఎల్‌వై)

⏩ డిప్లొమా ఇన్‌ రెస్పిరేటరీ థెరఫీ(డీఆర్‌ఈఎస్‌టీ)

⏩ డిప్లొమా ఇన్‌ మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ(డీఎంఎస్‌టీ)

⏩ డిప్లొమా ఇన్‌ పెర్‌ఫ్యూజిన్‌ టెక్నాలజీ(డీఈఆర్‌ఎఫ్‌యూ)

⏩ డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రిక్‌ టెక్నీషియన్‌(డీఓటీ)

⏩ డిప్లొమా ఇన్‌ రేడియో థెరఫీ టెక్నీషియన్‌ (డీఆర్‌టీటీ)

⏩ డిప్లొమా ఇన్‌ రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌(డీఆర్‌జీఏ)

⏩ డిప్లొమా ఇన్‌ డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ కోర్సు(డీడీఆర్‌ఏ)

⏩ డిప్లొమా ఇన్‌ కార్డియాలజీ టెక్నీషియన్‌ కోర్సు(డీకార్డియో)

⏩ డిప్లొమా ఇన్‌ క్యాత్ ల్యాబ్‌ టెక్నాలజీ(డీసీఎల్‌టీ)

⏩ డిప్లొమా ఇన్‌ ఈసీజీ టెక్నీషియన్‌ కోర్సు(డీఈసీజీ)

⏩ డిప్లొమా ఇన్‌ అనస్తీషీయా టెక్నీషియన్‌ కోర్సు(డీఏఎన్‌ఎస్‌)

⏩ డిప్లొమా ఇన్‌ మల్టిపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌- మేల్‌(డీఎంపీహెచ్‌ఏ)

అర్హతలు: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 16 సంవత్సరాలు నిండి ఉండాలి.

వ్యవధి: ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్‌సైట్‌ సూచించిన దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ చిరునామాకు పంపాలి. ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు: పదోతరగతి సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, ఇంటర్‌ సర్టిఫికెట్‌- మార్క్స్‌ షీట్స్‌, ఆరు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ తదితరాలు జత చేయాలి.

ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు లేకుంటే.. ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు గ్రూపు విద్యార్థులు లేకుంటే ఇతర గ్రూపు విద్యార్థులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 24.07.2023.

➥ కౌన్సెలింగ్ నిర్వహణ, అభ్యర్థుల కేటాయింపు: 01.08.2023.

➥ తరగతులు ప్రారంభం: 01.09.2023.

Notification

Website

ALSO READ:

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget