అన్వేషించండి

UGC NET Admit Card: యూజీసీ నెట్‌-2024 జూన్ సెషన్ హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?

UGC NET 2024: యూజీసీ నెట్‌ 2024 జూన్ సెషన్ అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

UGC NET 2024 June Session Admit Card: యూజీసీ నెట్-2024 జూన్ సెషన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. జూన్ 18న OMR (పెన్, పేపర్) విధానంలో యూజీసీ నెట్ జూన్-2024 సెషన్ పరీక్ష నిర్వహించన్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

యూజీసీ నెట్-2024 (జూన్ సెషన్) అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ ఇలా..

Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -ugcnet.nta.nic.in.

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'UGC NET June 2024: Click Here to Download Admit Card' లింక్ మీద క్లిక్ చేయాలి.

Step 3: అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి లాగిన్ అవ్వాలి.

Step 4: కంప్యూటర్ స్క్రీన్ మీద అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.

Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

UGC NET Admit Card (June)-2024

UGC NET Admit Card: యూజీసీ నెట్‌-2024 జూన్ సెషన్ హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?

UGC NET Admit Card: యూజీసీ నెట్‌-2024 జూన్ సెషన్ హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?

పరీక్ష విధానం..

➥ ఆఫ్‌లైన్ (OMR Based) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ALSO READ:

ఏటా రెండు సార్లు అడ్మిష‌న్లు, యూజీసీ నిర్ణ‌యంతో ల‌క్ష‌ల మంది విద్యార్థుల క‌ల సాకారం  
దేశంలో చదువుకుంటున్న యువతకు యూజీసీ గుడ్ న్యూస్ తెలిపింది. యూనివర్సిటీల్లో ఏడాదికి ఒక్కసారే అడ్మిష‌న్లు క‌ల్పిస్తున్న నేప‌థ్యంలో ల‌క్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూర‌మ‌వుతున్నార‌ు. దీంతో ఆన్‌లైన్‌ చదువులు కొనసాగిస్తున్నవారికి, దూరవిద్యా విధానంలో చదువు కోరుకునేవారికి.. ఇక నుంచి ఏటా రెండు సార్లు అడ్మిష‌న్లు క‌ల్పించేలా.. అనుమ‌తి ఇచ్చింది. ఈ విద్యాసంవ‌త్సరంలో జనవరి లేదా ఫిబ్రవరి, జూలై లేదా ఆగస్టు నెలల్లో విద్యార్థులకు  అడ్మిషన్లు క‌ల్పించ‌నున్నారు. ఈ మేర‌కు యూజీసీ విధాన నిర్ణాయక మండలి దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు, యూనివ‌ర్సిటీల‌కు ఈ మేరకు ప్రతిపాద‌న‌లు పంపించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth: సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు -  మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు - మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
YSRCP MLCs: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
Ustaad Bhagat Singh First Song : 'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth: సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు -  మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు - మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
YSRCP MLCs: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
Ustaad Bhagat Singh First Song : 'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Revanth Reddy Football Practice:
"పాలిటిక్స్ అయినా ఫుట్‌బాల్ అయినా నేను బరిలోకి దిగనంత వరకే... " ప్రాక్టీస్‌లో దుమ్మురేపుతున్న రేవంత్‌
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
Seaplane Water Aerodromes: ఏపీలో పది ప్రాంతాల్లో సీప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం 
ఏపీలో పది ప్రాంతాల్లో సీప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం 
Bhuta Shuddhi Vivaha: భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారు? ముహూర్తంతో సంబంధం లేకున్నా ఎందుకు? విధానం ఏంటి?
భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారు? ముహూర్తంతో సంబంధం లేకున్నా ఎందుకు? విధానం ఏంటి?
Embed widget