![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NTA PhD: ఎన్‌టీఏ- పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్ 2023, పరీక్ష ఎప్పుడంటే?
NTA Ph.D Entrance Test 2023: దేశంలోని పలు యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.
![NTA PhD: ఎన్‌టీఏ- పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్ 2023, పరీక్ష ఎప్పుడంటే? National Testing Agency has released notifcation for Ph.D. Entrance Test for DU, JNU, BHU and BBAU - 2023 NTA PhD: ఎన్‌టీఏ- పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్ 2023, పరీక్ష ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/b94760babc7f8ec03db049ed87d180821691995640457522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NTA Ph.D Entrance Test 2023: దేశంలోని పలు యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, బాబా భీమ్‌రావ్ అంబేడ్కర్ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ఆయా వర్సిటీల్లో సీటు కేటాయిస్తారు.
ప్రోగ్రామ్ వివరాలు..
* ఎన్‌టీఏ- పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్-2023
విభాగాలు: కామర్స్, ఫైనాన్స్, ఆర్ట్ & కల్చర్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సైన్సెస్, ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కామన్ కోర్సులు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: వయోపరిమితి నిబంధనలు లేవు.
దరఖాస్తు ఫీజు(ఒక పరీక్ష పేపర్): జనరల్ రూ.1200; ఓబీసీ- ఎన్‌సీఎల్/ జనరల్- ఈడబ్ల్యూఎస్ రూ.1100; ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగులకు రూ.1000. అదనంగా పేపర్లు రాయాలంటే పేపర్‌కు జనరల్ అభ్యర్థులకు రూ.800, మిగిలిన అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్.700 అదనంగా చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి విభాగంలో రిసెర్చ్ మెథడాలజీ, రెండో విభాగంలో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు (180 నిమిషాలు).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.09.2023 ( రాత్రి 9 గంటల వరకు)
➥ దరఖాస్తుల సవరణ తేదీలు: 09.09.2023 నుంచి 11.09.2023 (రాత్రి 11.50 గంటల వరకు)
➥ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్: వెల్లడించాల్సి ఉంది.
➥ అడ్మిట్ కార్డుల వెల్లడి: పరీక్షకు 3 రోజుల ముందు నుంచి.
➥ పరీక్ష తేదీ: వెల్లడించాల్సి ఉంది.
ALSO READ:
బీసీ గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని మహాత్మా జోతిబా ఫులే బీసీ గురుకులాల్లో బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు జులై 31తోనే ముగియగా.. ఆగస్టు 16 వరకు పొడిగించారు. తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వనపర్తి, కరీంనగర్‌లోని అగ్రికల్చరల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంసెట్, అగ్రిసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 16న సాయంత్రం 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)