అన్వేషించండి

JEE(Main) 2025 Answer Key: జేఈఈ మెయిన్‌ తొలి విడత ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం

JEE Main: జేఈఈ మెయిన్‌ 2025 (సెషన్‌-1) పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని నేషనల్‌ టెస్టింగ్‌ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచింది.

Answer Key Challenge for JEE(Main) 2025 Session-1: దేశవ్యాప్తంగా జనవరి 22 నుంచి 29 మధ్య నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (జనవరి 2025) పేపర్‌-1 ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ (NTA) ఫిబ్రవరి 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎన్టీఏ తెలిపింది. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 4 నుంచి 6న రాత్రి 11.50 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1, జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2 జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. రోజూ ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3- 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి.

ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..

PUBLIC NOTICE

అభ్యంతరానికి రూ.200 ఫీజు..
జేఈఈ మెయిన్ 2025 ఆన్సర్ కీని సవాలు చేయడానికి విండో ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ విండో ఫిబ్రవరి 6, గురువారం రాత్రి 11:50 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆన్సర్ కీని సవాలు చేయాలనుకునే అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ తాజా నోటీసులో పేర్కొంది. ఈ ఫీజును డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయాలి. ఫీజులు రీఫండ్ చేయబడవు. మరే ఇతర విధానం ద్వారా చెల్లింపు చేయకూడదు.

ఒక ప్రశ్నకు మార్కులు..
జనవరి 23న తొలి విడత భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నను విరమించుకోగా, దానికి 4 మార్కులు కలుపుతారు. జనవరి 28న సాయంత్రం విడతలోని భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు 2 సమాధానాలు మార్చారు. అందులో దేన్ని గుర్తించినా మార్కులు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా 295 వరకు మార్కులు రావొచ్చని జేఈఈ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 12లోపు జేఈఈ మెయిన్ పర్సంటైల్‌ స్కోర్‌ను వెల్లడిస్తామని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌ 1 నుంచి రెండో విడత పరీక్షలు..
ఇక జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నారు. రెండు విడత పరీక్షల్లో  విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గతేడాది సుమారు 24 వేల సీట్లు;23 ఐఐటీల్లో 17,600 సీట్లు; ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500 సీట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. జేఈఈ మెయిన్‌ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్‌ (రెండూ రాస్తే)ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్‌ 17వ తేదీ నాటికి ర్యాంకులు ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తులకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Embed widget