అన్వేషించండి

FMGE June 2024 Notification: 'ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

FMGE 2024: విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసుకున్నవారికి స్వదేశంలో ప్రాక్టీస్‌ కోసం నిర్వహించే 'ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ జూన్ - 2024' నోటిఫికేషన్‌ను NBEMS ఏప్రిల్ 29న విడుదల చేసింది.

Foreign Medical Graduate Examination June 2024: విదేశాల్లో మెడిసిన్ విద్యను పూర్తిచేసుకున్నవారికి స్వదేశంలో మెడికల్ ప్రాక్టీస్‌ కోసం నిర్వహించే 'ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (FMGE) జూన్ - 2024' నోటిఫికేషన్‌ను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(NBEMS) ఏప్రిల్ 29న విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే.. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(MCI) లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం పొందవచ్చు. ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్టును NBEMS నిర్వహిస్తోంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే +91-799616533 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

ప్రస్తుతం ఎఫ్‌ఎంజీఈ-2024 జూన్‌ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 29న ప్రారంభంకాగా.. మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు మే 24 నుంచి 28 వరకు అవకాశం కల్పిస్తారు. ఇక జూన్ 7 నుంచి 10 వరకు దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం కల్పిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 1న విడుదల చేసి జులై 6న పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 6న పరీక్ష ఫలితాలను NBEMS విడుదల చేయనుంది.

వివరాలు..

* ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (FMGE) జూన్ - 2024

అర్హతలు..
➥ భారత జాతీయులు లేదా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30లోపు విదేశాల్లో ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన విద్య ఉత్తీర్ణులై ఉండాలి.

➥ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ) పూర్తిచేసి.. పీజీలో సీటు సంపాదించినవారు (లేదా) ఆయా దేశాల్లో ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అనుమతి లభించిన అభ్యర్థులకు మాత్రం ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నేరుగా ఎంసీఐ/ఎస్‌ఎంసీలో సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు.

➥  పాకిస్తాన్‌లో మెడిసిన్‌ పూర్తిచేసినవారు కేంద్ర హోంశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.6195 చెల్లించాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం..
మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను రెండు పార్ట్‌లుగా నిర్వహిస్తారు. ప్రతి పార్ట్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో అడుగుతారు. ఒక్కో పార్ట్‌కు రెండున్నర గంటల (150 నిమిషాలు) సమయం కేటాయిస్తారు. రెండు పార్ట్‌లకు కలిపి మొత్తం పరీక్ష సమయం 300 నిమిషాలపాటు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఎలాంటి రుణాత్మక (నెగెటివ్) మార్కులు లేవు. ఈ పరీక్షల్లో అర్హత సాధించాలంటే.. మొత్తం 300 మార్కులకు గాను కనీసం 150 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.04.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.05.2024.  (11:55 PM)

➥ అభ్యర్థుల దరఖాస్తుల సవరణ: 24.05.2024 - 28.05.2024.

➥ దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం: 07.06.2024 - 10.06.2024.

➥ అడ్మిట్‌ కార్డ్‌ల జారీ: 01.07.2024.

➥ పరీక్ష తేదీ: 06.07.2024.

➥ ఫలితాల వెల్లడి: 06.08.2024.

Public Notice

Notification

Online Application

Website

FMGE June 2024 Notification: 'ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Embed widget