MJPTBCWREIS: తెలంగాణ బీసీ గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వనపర్తి మహిళా వ్యవసాయ కాలేజీలో 120 సీట్లు, కరీంనగర్ మహిళా వ్యవసాయ కాలేజీలో 120 సీట్ల చొప్పున ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వివరాలు..
* బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (నాలుగేళ్లు)
కళాశాలలు, సీట్ల వివరాలు..
➥ వ్యవసాయ కళాశాల, వనపర్తి: 120 సీట్లు
➥ వ్యవసాయ కళాశాల, కరీంనగర్: 120 సీట్లు
అర్హత: తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్ స్పెషలైజేషన్‌లో డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1,50,000; పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2,00,000 మించకూడదు.
వయోపరిమితి: 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ప్రతి ఒక్కరూ దరఖాస్తు సమయంలో రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: తెలంగాణలో ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్-2023 లేదా పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్-2023లో సాధించిన ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 01.08.2023 నుంచి 02.08.2023 వరకు.
ALSO READ:
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి!
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు మరో అవకాశం, సీఎస్‌ఏబీ కీలక నిర్ణయం!
జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా.. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు రానివారికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లభించదు. ఇలాంటివారి కోసం జోసా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు ఓ అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, 75 శాతంలోపు మార్కులు వచ్చినవారు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మార్కులు పెంచుకుంటే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు లభిస్తుంది. జోసా కౌన్సెలింగ్‌కు హాజరైనప్పుడుగానీ, ప్రవేశాల సందర్భంలో గానీ మార్కుల జాబితా సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షల సమయంలో అనారోగ్యం, ఇతర కారణాలతో సరిగా పరీక్ష రాయలేక తక్కువ మార్కులు పొందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial