By: ABP Desam | Updated at : 08 Feb 2022 11:27 AM (IST)
మెడికల్ కౌన్సెలింగ్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare Residential Educational Institutions Society)కి చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించారు. మొదటి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్‌లో 190 మంది విద్యార్థులు సీట్లు సాధించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అభినందించారు. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించారని తెలిపారు. వీరిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు చదువుకోలేదని, ఇంట్లో తొలి డాక్టర్ కాబోతున్నారని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
టీచింగ్ స్టాఫ్ సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే ఇలాంటి ఫలితాలు సాధించామని లెక్ఛరర్లను కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందించారు. పేద విద్యార్థులకు చదువుతో పాటు కెరీర్ గురించి టీచింగ్ స్టాఫ్ దిశా నిర్దేశం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో సీట్లు సాధించి వారి కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సోసైటీ (TSWREIS)లో చదువుకుంటున్న విద్యార్థులు కార్పొరేట్ సంస్థల విద్యార్థులతో పోటీపడి సీట్లు సాధించడంపై ఉన్నతాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల విద్య కోసం నీట్ కోచింగ్ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని రొనాల్డ్ రోస్ తెలిపారు.
Secretary praised teaching staff for their hard work in guiding poor students from villages, tribal areas and urban slums achieve their long-cherished dreams of joining medical colleges, IITs, NITs, premier higher educational institutions.
— IPRDepartment (@IPRTelangana) February 7, 2022
మహబూబాబాద్ జిల్లా చర్లపాలెంకు చెందిన స్పందనకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. స్పందన తండ్రి ప్రైవేట్ స్కూల్ టీచర్, తల్లి ఇంటి పనులు చూసుకుంటారు. కష్టపడి తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తానని విద్యార్థిని స్పందన చెప్పారు. నాగర్‌కర్నూలు జిల్లా సింగోటం గ్రామానికి చెందిన కొమ్ము స్నేహ తండ్రి కండక్టర్‌గా పనిచేసేవారు. అయితే స్కూల్లో చదువుతున్న సమయంలో తండ్రి చనిపోగా, తల్లి కూలి పనులు చేసి చదివించారు. కాగా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆమెకు సీటు వచ్చింది.
ఈ ఫలితాలు అద్భుతం.. మంత్రి కేటీఆర్
గత ఆరేళ్లలో 512 మంది సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏకంగా 190 ఎంబీబీఎస్ సీట్లు సాధించారని అద్భుతమైన ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అభినందించారు.
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్స్
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆదివారం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.
Also Read: Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు
Also Read: జేఎన్‌యూ తొలి మహిళా వైస్ ఛాన్స్‌లర్‌గా శాంతిశ్రీ నియామకం
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
JAM-2023: ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్' - నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు!
OU PG Exams: ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా, కారణమిదే?
LIC HFL Vidyadhan Scholarship: విద్యార్థి చదువుకు ఉపకారం, ‘విద్యాధనం’ స్కాలర్షిప్!
Virchow Scholarship Program: బాలికల విద్యకు ప్రోత్సాహం - విర్చో స్కాలర్షిప్ ప్రోగ్రామ్
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!
కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?