JNU New Vice Chancellor: జేఎన్‌యూ తొలి మహిళా వైస్ ఛాన్స్‌లర్‌గా శాంతిశ్రీ నియామకం
జేఎన్‌యూకు తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియమితులయ్యారు.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) కొత్త వైస్ ఛాన్స్‌లర్‌గా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జేఎన్‌యూకు తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ రికార్డ్ సృష్టించారు. ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు.
ప్రస్తుతం మహారాష్ట్ర సావిత్రి బాయి ఫులే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు శాంతిశ్రీ. జేఎన్‌యూ యూనివర్సిటీలోనే ఆమె ఎమ్‌ఫిల్ సహా అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ప్రస్తుతం జేఎన్‌యూ యాక్టింగ్ వీసీగా ఉన్న ఎమ్ జగదీశ్ కుమార్.. తన ఐదేళ్ల పదవీకాలాన్ని గత ఏడాది పూర్తి చేసుకున్నారు. గత వారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్‌గా జగదీశ్ నియమితులయ్యారు.
కెరీర్..
- 1988లో గోవా యూనివర్సిటీలో బోధన కెరీర్‌ను ప్రారంభించారు ప్రొఫెసర్ పండిట్.
- ఆ తర్వాత 1993లో ఆమె పుణె యూనివర్సిటీకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
- అనంతరం యూజీసీ సభ్యురాలిగా కూడా ఆమె ఉన్నారు. వివిధ విశ్వవిద్యాలయ్యాల్లో ఆమె చాలా హోదాల్లో పని చేశారు.
- 59 ఏళ్ల శాంతిశ్రీ ఇప్పటివరకు ఆమె కెరీర్‌లో 29 పీహెచ్‌డీలకు గైడ్ చేశారు.
Also Read: UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాం'