AIతో ఆకలి తీర్చే సరికొత్త పరికరం! మంగుళూరు కుర్రాడి సంచలనం, మీ కోసం ఫుడ్ ఆర్డర్ చేసే టూల్
AI Tool: ఆకలేస్తే అన్నం పెడతానంటోంది ఏఐ టూల్. మంగుళూరు చెందిన వ్యక్తి దీన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.

AI Tool: ఇప్పుడు నడుస్తున్నదంతా ఏఐ యుగం. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలని, పనిని మరింత సులభతరం చేసుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంలోనే మంగుళూరుకు చెందిన కుర్రాడు క్రియేట్ చేసిన ఓ పరికరం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆకలేస్తే చాలు మీ అనుమతితో సంబంధం లేకుండా మీ కోసం ఫుడ్ ఆర్డర్ చేసే టూల్‌ను కనిపెట్టాడు. ఇది చూడటానికి చిన్న గడియారం మాదిరిగానే ఉంటుంది. ఈ పరికరం ఎలా పని చేస్తుంది, ఎలా పుడ్‌ను ఆర్డర్ చేస్తుందో కూడా మంగళూరుకు చెందిన సోహాన్ ఎం రాయ్ వివరించాడు.
సోహాన్ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తుండే వారు. ఆయనకు ఓ స్టార్టప్ కంపెనీ కూడా ఉంది. ఏఐతో వస్తున్న రివెల్యూషన్‌ను ఆధారంగా ఈ MOM పరికరాన్ని క్రియేట్ చేశారు. చాలా మంది పని ధ్యాసలో పడి ఆకలిగా ఉన్నా సరే ఫుడ్ ఆర్డర్ చేయడానికి, బద్దకిస్తుంటారు. తినేందుకు కూడా ఆసక్తి చూపరు. అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సోహాన్ చెబుతున్నారు.
ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసే ఈ మీల్ ఆర్డరింగ్ మాడ్యూల్ గురించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియో పెట్టారు. ఎలా పని చేస్తుందో వివరంగా చెప్పారు. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఈ ఏఐ మెషిన్ అర్థం చేసుకుటుంది. వెంటనే ఆటోమేటిక్‌గా జొమాటోలాంటి ఫుడ్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. అని తెలిపారు.
జనరల్‌గా ఆకలి వేసినప్పుడు కడుపులో ప్రత్రిక్రియలు జరుగుతాయి. వాటి నుంచి శబ్దాలు వస్తుంటాయి. వాటిని పసిగట్టే ఈ ఎంవోఎం ఫుడ్‌ను ఆర్డర్ చేస్తుంది. దీని కోసం ఆయన చాలా కాలంగా శ్రమించాడు. ఇందులో హార్డ్‌వేర్‌తోపాటు వైద్యులు ఉపయోగించ స్టెతస్కోప్‌ను కూడా యూజ్ చేశాడు. కడుపులో వచ్చే శబ్ధాలను విశ్లేషించి ఆకలి వేస్తుందా, ఏ స్థాయిలో ఆకలి వేస్తుందనే విషయాలు తెలుసుకునేందుకు ఆడేటాను క్లౌడ్ సహాయంతో ఈ పరికరం అంచనాకు వస్తుంది.
దీన్ని సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నెటిజన్ల నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. వాటికి ఓపికతో సోహాన్ సమాధానాలు చెప్పారు. ఈ పరికరం పరీక్షించేందుకు తాను రాత్రి మొత్తం తినకుండా ఉన్నానని, వాటి ఆధారంగానే పొట్టలో వచ్చే శబ్ధాలు ఆధారంగా పరికరం రియాక్ట్ అయ్యిందని వివరించారు. తనకు ఈ పరికరమే ఫుడ్ ఆర్డర్ పెడుతుందని వెల్లడించారు.
View this post on Instagram
ఈ పరికరం చిన్నగా ఉండి ఉంటే మనుషుల కంటే పెంపుడు జంతువులకు అటాచ్ చేసి వాటి ఆకలి తీర్చవచ్చని మరికొందరు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. జంతువులకు ఇలాంటి టూల్స్ అవసరం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
సోహాన్ కర్ణాటకు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్. మంగళూరుకు చెందిన సోహాన్ జికిగుయ్ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ నడుపుతున్నారు. ఇందులో టెక్నాలజీకి సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్ చేస్తూ పోస్టు చేస్తుంటాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వివిధ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేశారు. తర్వాత తన సొంతగా కంపెనీ పెట్టుకున్నారు. తరచూ సోషల్ మీడీయలో కంటెంట్ పోస్టు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఆకలి అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టే టూల్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంటున్నారు.
రెండేళ్ల క్రితం జొమాటోలో పని చేసిన సోహాన్ డ్రోన్ ద్వారా ఫుడ్‌ను డెలివరీ చేసి వైరల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు మరో టూల్‌తో సంచలనంగా మారారు.





















