(Source: ECI/ABP News/ABP Majha)
నేడు ‘మన ఊరు – మన బడి పథకం’ పాఠశాలలు ప్రారంభం! తొలివిడతలో ఎన్నంటే?
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమం కింద పనులు పూర్తయిన 680 పాఠశాలలను నేడు (ఫిబ్రవరి 1) ప్రారంభించనున్నారు. ఒకేసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించాలని నిర్ణయించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అధికారికంగా మాత్రం ఎన్ని పాఠశాలలన్నది ప్రభుత్వం చెప్పడం లేదు. తొలి విడతలో రాష్ట్రంలోని 9,123 పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం రూ.3,497 కోట్లతో 12 రకాల సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మార్చిలో సీఎం కేసీఆర్ వనపర్తిలో కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మండలానికి కనీసం రెండు చొప్పున 1210 పాఠశాలలను ప్రారంభించాలని రెండు మూడు నెలలుగా అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రస్తుతానికి 680 పాఠశాలలు సిద్ధం కావడంతో వాటిని బుధవారం ఒకేసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించాలని నిర్ణయించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్ బోర్డులు, మరమ్మతులు, డిజిటల్ విద్య అందించేందుకు పరికరాలు, ప్రహరీలు, వంట గది, డ్యూయల్ డెస్కులు, ఉన్నత పాఠశాలలైతే భోజనశాలలు తదితర 12 రకాల సౌకర్యాలు కల్పించారు. సుమారు మరో 600 పాఠశాలలను కొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
జిల్లాలవారీగా పాఠశాలల సంఖ్య
ఆదిలాబాద్ 37, భద్రాద్రి కొత్తగూడెం 46, హనుమకొండ 28, హైదరాబాద్ 32, జగిత్యాల 36, జనగామ 24, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులాంబ గద్వాల 24, కామారెడ్డి 44, కరీంనగర్ 30, ఖమ్మం 62, కుమ్రంభీం ఆసిఫాబాద్ 30, మహబూబాబాద్ 32, మహబూబ్‌నగర్ 32, మంచిర్యా ల 36, మెదక్ 42, మేడ్చల్ మల్కాజిగిరి 30, ములుగు 18, నాగర్‌కర్నూల్ 40, నల్లగొండ 62, నారాయణపేట 22, నిర్మల్ 38, నిజామాబాద్ 59, పెద్దపల్లి 28, రాజన్నసిరిసిల్ల 26, రంగారెడ్డి 55, సంగారెడ్డి 55, సిద్దిపేట 48, సూర్యాపేట 46, వికారాబాద్ 38, వనపర్తి 28, వరంగల్ 26, యాద్రాద్రి భువనగిరి 34 చొప్పున మొత్తంగా 1,210 పాఠశాలల్లో పనులను పూర్తిచేశారు.
విద్యకు పెద్దపీట: మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ట్విటర్‌లో తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మన ఊరు- మనబడి పథకంలో భాగంగా కేజీ నుంచి పీజీ విద్యాప్రాంగణాన్ని అద్భుతంగా రూపొందించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఈ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అక్కడ అంగన్‌వాడీ నర్సరీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, హైస్కూలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మించినట్లు పేర్కొంటూ వాటి ఫొటోలు జత చేశారు.
Education is getting much needed attention in #Telangana
— KTR (@KTRBRS) January 31, 2023
Delighted that Education Minister @SabithaindraTRS Garu & myself will be launching the pioneering KG to PG Campus developed under the “Mana Ooru - Mana Badi” at Gambhiraopet tomorrow pic.twitter.com/xONfnHvDYs
Also Read:
తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ప్రవేశప్రకటన, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..