News
News
X

Overseas Scholarships: బీసీ 'విదేశీవిద్య' పథకానికి ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు! వీరు అర్హులు!

విదేశీవిద్య ప్రయోజనం కోరువారు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల వయసు జులై 1 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలె బీసీ 'విదేశీవిద్య' పథకానికి అర్హులైనవారు దరఖాస్తు కోవాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కోరారు. విదేశాల్లో పీజీ చదివేందుకు ఈ పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. విదేశీవిద్య ప్రయోజనం కోరువారు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల వయసు జులై 1 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వివరాలను తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని డిగ్రీలో 60 శాతం మార్కులు తెలిపారు.

పథకానికి అర్హతలివే..

➥ డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో తగిన స్కోరు ఉండాలి. ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ టెస్ట్ అర్హత సాధించాల్సి ఉంటుంది.

➥ విద్యార్థుల వయసు 01.07.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.

➥ కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి.

➥ కుటుబంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

➥ పథకానికి ఎంపికైన విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందుతారు. * పథకానికి అర్హత సాధించిన వారికి 20 లక్షల రూపాయల వరకు విదేశీ విద్య సాయం అందుతుంది. ఇతర రాయితీలు కూడా వర్తిస్తాయి.

Website

Also Read:

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి కొత్త 'గ్రూపు' అందుబాటులోకి!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంట్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

విద్యార్థులకు గుడ్ న్యూస్, డ్యూయల్ డిగ్రీ విధివిధానాలు జారీ!
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఇంటర్ 'అఫిలియేషన్‌'కు 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ! ఏప్రిల్‌ 30 నాటికి కళాశాలల జాబితా!
తెలంగాణలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌(గుర్తింపు)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇంటర్‌ బోర్డు సోమవారం (జనవరి 23) విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ కళాశాలల గుర్తింపుకు ఆయా కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ ఈమేరకు ఉత్తర్వుల్లో తెలిపారు. జనవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. మండల పరిధిలోని కాలేజీల షిఫ్టింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల అప్‌లోడింగ్‌కు ఫిబ్రవరి 21 వరకు గడువిచ్చారు. రూ.20వేల అపరాధ రుసుముతో మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఏప్రిల్‌ 30వ తేదీన వెల్లడిస్తామని పేర్కొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలను పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 26 Jan 2023 01:39 PM (IST) Tags: Overseas education Education News in Telugu Latest Education News in Telugu Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi MJPOVN for BC and EBC students

సంబంధిత కథనాలు

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత