అన్వేషించండి

Inter Results 2024: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్, తర్వాతి స్థానాల్లో నిలిచిన జిల్లాలివే

Inter Results 2024: ఏపీలో ఏప్రిల్ 12న విడుదల చేసిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఎప్పటిలాగా కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి.

AP Inter Results: ఏపీలో ఏప్రిల్ 12న విడుదల చేసిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఎప్పటిలాగా కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక 81 శాతంతో గుంటూరు రెండో స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా 48 శాతం ఉత్తీర్ణతతో ఆఖరి స్థానంలో ఉంది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.

ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజు వివరాలను అధికారులు వెల్లడించారు.  ఈ ఏడాది ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే  రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం. 

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,35,056 మంది అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. విద్యార్థుల మార్కులను అప్‌లోడ్ చేసిన అధికారులు ఏప్రిల్ 12న ఫలితాలను వెల్లడించారు. 

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి

Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి

Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి

Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి

Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి

Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్ ఫలితాల డైరెక్ట్ లింక్

ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల డైరెక్ట్ లింక్

https://resultsbie.ap.gov.in/

https://bieap.apcfss.in/

https://www.manabadi.co.in/

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget