KNRUHS MBBS: ఎంబీబీఎస్ ప్రవేశాలకు 22, 23వ తేదీల్లో వెబ్‌ఆప్షన్లు! ఇదే లాస్ట్ చాన్స్
రాష్ట్రవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ యాజ మాన్య కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. యాజమాన్య కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఎంబీబీఎస్ యాజమాన్యకోటా సీట్లకు డిసెంబరు 22, 23 తేదిల్లో వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం (డిసెంబరు 21) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ యాజ మాన్య కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. యాజమాన్య కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబరు 22న ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 23న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద కేటీగిరి-బి అభ్యర్థులు రూ.40,000; కేటగిరి-సి(ఎన్‌ఆర్ఐ) అభ్యర్థులు రూ.70,000 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్‌వే ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నిర్ణీత ట్యూషన్ ఫీజు మాత్రం సంబంధిత కళాశాలలో చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ యూజీ-2022 అర్హత సాధించి ఉండాలి.
Also Read:
PJSAU BSc Course Fee: అగ్రికల్చర్, హార్టికల్చర్ బీఎస్సీ ఫీజులు ఖరారు - ఏ కోర్సుకు ఎంతంటే?
సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సు ఫీజులను ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖరారు చేసింది. బీఎస్సీ కోర్సులో చేరాలంటే ఇకపై మొదటి సంవత్సరం రూ.11 లక్షల ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మిగిలిన మూడేళ్లు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. అలాగే హార్టికల్చర్ బీఎస్సీ కోర్సుకైతే మొదటి ఏడాది రూ.6 లక్షలు, మిగిలిన మూడేళ్లపాటు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని తెలిపింది. ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. ఈడబ్ల్యుఎస్ కేటగిరీకి చెందిన విద్యార్థులు తప్ప.. మిగిలినవారంతా ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని స్పష్టంచేసింది. ఎంసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏజీ బీఎస్సీ కోర్సులో 154, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో 10, హార్టీకల్చర్ బీఎస్సీలో 40 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లన్నీ జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నందున వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రైవేటు కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరాలంటే ఇంతకన్నా ఎక్కువగా రుసుములు ఉన్నందున విద్యార్థులు వీటిలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS EAMCET 2023: జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్! ఈ సారికి 'ఇంటర్' వెయిటేజీ లేనట్లే?
తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ జనవరిలో విడుదలకానుంది. ఒకపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను వెల్లడించడం, మరోవైపు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. ఎంసెట్ పరీక్షను మే రెండోవారం లేదా మూడోవారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..