News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

BDS Counselling: బీడీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడిక్ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా బీడీఎస్‌ ప్రవేశాలకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడిక్ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా బీడీఎస్‌ ప్రవేశాలకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించింది. విద్యార్థులు ఆగస్టు 24న ఉదయం 10 గంటల నుంచి ఆగ్టు 26న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్‌ జాబితా, అదేవిధంగా కళాశాల వారీగా సీట్ల (సీట్ మ్యాట్రిక్స్) వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

కౌన్సెలింగ్ ద్వారా బీడీఎస్ కోర్సులో సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద రూ.12,000 ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, అలాట్‌మెంట్ లెటర్ పొందాల్సి ఉంటుంది. ఇక కాలేజీ ఫీజు కింద ఏడాదికి ప్రభుత్వ కళాశాల అయితే రూ.10,000; ప్రైవేటు కళాశాల అయితే రూ.45,000 చెల్లించాల్సి ఉంటుంది.

సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..
➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tsmedadm2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 
➥ నిబంధనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్:  knrugadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 
➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9959101577 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 
➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

Notification

Web Options 

BDS Seat Matrix

ALSO READ:

ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీకి మార్గం 'జామ్', పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకానుంది. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 24 Aug 2023 10:17 AM (IST) Tags: KNRUHS Admissions KNRUHS BDS Admissions KNRUHS BDS Counselling TS BDS Admissions KNRUHS BDS Admissions 2023

ఇవి కూడా చూడండి

Agri Courses: ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా

Agri Courses: ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?