KNRUHS Admissions: ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి 22, 23వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు!
పీజీ హోమియో కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీచేయనున్నారు. అభ్యర్దుల నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్లు కేటాయింపులు జరపనున్నారు.
![KNRUHS Admissions: ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి 22, 23వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు! knruhs - admission into md (homoeo) courses for 2022-23 under management quota - notification for exercising one time web options KNRUHS Admissions: ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి 22, 23వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/74efcbc9cbdaf0f2ae94a554fe0913a51663882266066522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదలచేసింది. పీజీ హోమియో కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీచేయనున్నారు. అభ్యర్దుల నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్లు కేటాయింపులు జరపనున్నారు.
అర్హులైన అభ్యర్ధుల ఆన్‌లైన్‌లో ఈనెల 22వ తేదిన ఉదయం 9 గంటల నుంచి 23వ తేది సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు మంగళవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ముచ్చింతల్‌లోని జీయర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్), సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ హోమియో కాలేజీలో మేనేజ్‌మెంట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిమ్స్‌లో 25 సీట్లు, ఎంఎన్ఆర్ కాలేజీలో 34 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Counselling Website (fr Web Options)
Also Read:
NMC: పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లాలకు పోవాల్సిందే! ఎప్పటినుంచంటే?
దేశంలో పీజీ వైద్య విద్యార్థులు ఇకపై జిల్లాల్లోని ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందే. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిప్రకారం పీజీ వైద్య విద్యార్థులకు మార్చి 1 నుంచి 'డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్' అమలుచేయబోతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించే వారు కోర్సు ముగిసేలోగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రుల పరిధిలో పనిచేయడాన్ని ఎన్ఎంసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం, స్పెషలైజేషన్లు ఇవే!
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లోని 10 యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించవచ్చు. కోర్సుల కాలవ్యవధి ఏడాది ఉంటుంది. ఇంగ్లిష్ మీడియంలోనే కోర్సులు ఉంటాయి.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)