Medical PG Merit List: మెడికల్ పీజీ మెరిట్ జాబితా విడుదల, 4743 మంది ఎంపిక
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ మెడికల్ అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 31న విడుదల చేసింది.
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ మెడికల్ అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 31న విడుదల చేసింది. రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి పీజీ కన్వీనర్ కోటా కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించింది. మొత్తం 4743 మంది అభ్యర్థులతో మెరిట్ జాబితాను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 2లోపు తెలపాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..
ఎంపికకాని అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..
పీజీ మెడికల్, డెంటల్ దివ్యాంగుల జాబితాను కూడా కాళోజీ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థులు చోటు సంపాదించారు. అభ్యర్థులు ఆగస్టు 3న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ పంజాగుట్టాలోని నిమ్స్ హాస్పిటల్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మెడికల్ బోర్డు నిర్వహించే అసెస్‌మెంట్ కోసం హాజరుకావాల్సి ఉంటుంది.
దివ్యాంగుల జాబితా కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
కొత్త మెడికల్ కాలేజీల కన్వీనర్ కోటా పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు
తెలంగాణలో 2014 జూన్ 2 తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా పీజీ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ జులై 29న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 117 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..