అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ఆ విద్యార్థులకు ఆర్థికభారం తగ్గినట్టే! కొత్తగా నాలుగు ఇంజినీరింగ్‌ కాలేజీల ఏర్పాటుకు జేఎన్‌టీయూ కసరత్తు!

రాష్ట్రంలోని మరింత మంది పేద విద్యార్థులకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే. రాష్ట్రంలోని మరింత మంది పేద విద్యార్థులకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో నాలుగు కొత్త ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు జేఎన్‌టీయూ-హైదరాబాద్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జేఎన్‌టీయూ కార్యనిర్వాహక కమిటీలో గురువారం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో జేఎన్‌టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ గోవర్ధన్, కార్యనిర్వాహక మండలి సభ్యులు పాల్గొన్నారు. 

ఉన్నత విద్యామండలి నివేదిక ఇచ్చాక, సీఎం ఆదేశాలకు అనుగుణంగా కళాశాలల ఏర్పాటుకు జేఎన్‌టీయూ చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌తోపాటు సుల్తాన్‌పూర్, జగిత్యాల, మంథని, సిరిసిల్ల, వనపర్తిలో ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తోంది. కొత్తగా ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలను ప్రారంభించాలంటూ ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. ఈమేరకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు వారు కొద్ది నెలల క్రితం వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు. వీటితోపాటు మరో ప్రాంతంలోనూ కళాశాల ఏర్పాటు కానుంది. 

కొత్త ఇంజినీరింగ్ కళాశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాలపై ఈసీ సభ్యులు చర్చించారు. వనపర్తి, సిరిసిల్లలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల ఏర్పాటుకు నిధులను కేటాయించారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో కొత్తగా 300 కంప్యూటర్ల కొనుగోలుకు రూ.3 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.50 లక్షల విడుదలకు అంగీకరించారు. 

Also Read:

ఒకేరోజు 10 వేల లైబ్రరీలు 1,600 స్మార్ట్ తరగతుల ప్రారంభానికి శ్రీకారం!
తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో విద్యారంగంలో సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో మే 24న అధికారులతో సమీక్ష జరిపారు. జూన్‌ 20న నిర్వహించే 'తెలంగాణ విద్యా దినోత్సవం' వేడుకలను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఒకేరోజు 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు, రీడింగ్‌ కార్నర్లు, 1,600 స్మార్ట్‌ తరగతి గదులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

బాసర ట్రిపుల్‌ ఐటీ షెడ్యూల్‌ విడుదల, జూన్‌ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల బీటెక్‌ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 1న నోటిఫికేషన్‌ వెలువడనుంది. జూన్‌ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్‌ కేటగిరీ కింద పీహెచ్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ తదితర విద్యార్థులు జూన్‌ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్‌ 26న మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget