అన్వేషించండి

JNTU: బీటెక్ విద్యార్థులు ఫస్టియర్ ఫెయిలైనా, సెకండియర్‌కి ‘ప్రమోషన్‌’ - క్రెడిట్స్ తగ్గించిన జేఎన్‌టీయూ

ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో సంవత్సరానికి ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుగా మొదటి ఏడాది అకడమిక్ క్రెడిట్స్‌ను 75 శాతానికి తగ్గించింది. 

JNTU Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల్లో చాలా మంది ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఫెయిలవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జేఎన్‌టీయూ హైదరాబాద్ అలాంటి విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుగా మొదటి ఏడాది అకడమిక్ క్రెడిట్స్‌ను 75 శాతానికి తగ్గించింది. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ విద్యాసంవత్సరానికి ఏకంగా క్రెడిట్స్ వ్యవస్థనే తొలగించిన సంగతి తెలిసిందే. క్రెడిట్స్‌ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్ ఇస్తున్నా.. మిగిలిన సెమిస్టర్లలో వారికి ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. వర్సిటీ అధికారులు మాత్రం.. విభిన్న నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

ఫెయిల్ అవడానికి అదే కారణమా?
ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే వందల మంది ఉత్తీర్ణులు కాకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌లో తెలుగు మాధ్యమం చదివిన వారిలో చాలామందికి ఒకేసారి ఇంగ్లిష్ మీడియంలో చదవాలంటే ఇబ్బందిగా మారడం, గ్రామాల్లో చదువుకున్న వారు నగరాల పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు. ఇక ఉస్మానియా, జేఎన్‌టీయూలలో సరైన సంఖ్యలో ప్రొఫెసర్లు లేకపోవడం కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇంజినీరింగ్‌లో కొత్తగా వచ్చిన సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి కోర్సులపై కొందరు ప్రొఫెసర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంలేదు. దీంతో కళాశాలల్లో బోధనా ప్రమాణాలు తగ్గిపోయి ఫెయిలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణలు అంటున్నారు. 

డిటెన్షన్ విధానంతో ఆత్మన్యూనత..
డిటెన్షన్ విధానంతో విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం కలుగుతోందని, క్రెడిట్స్ తగ్గింపు కేవలం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితమనే విషయాన్ని గుర్తించాలని కెరీర్ కౌన్సిలర్ బి.రాజశేఖర్ చెబుతున్నారు. పాఠాలు అర్థం కావడంలేదని.. ఫెయిలవుతున్నారని రెండో సంవత్సరానికి ప్రమోషన్ కోసం క్రెడిట్స్‌ను తగ్గించడం సరికాదని, బోధనా ప్రమాణాలు పెంచాలని ఉస్మానియా మాజీ ఉపకులపతి ఎ.రామచంద్రం సూచిస్తున్నారు.

ALSO READ: 
దేశవ్యాప్తంగా 10 వేల విద్యాసంస్థలకు రుణాల జారీ లక్ష్యం: ఆక్సిలో ఫిన్‌సర్వ్‌

రాబోయే 5 సంవత్సరాలలో (2028 నాటికి) దేశవ్యాప్తంగా 10 వేల పాఠశాలలు, విద్యా సంస్థలకు రుణ నిధులు సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆక్సిలో ఫిన్‌సర్వ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 20న ప్రణాళికలను ప్రకటించింది. విద్యా సంస్థలు తమ సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ, అధిక ఖర్చుతో కూడిన అప్పుల భర్తీకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

టీఎస్ లాసెట్ రెండో విడతలో 3,331 మందికి ప్రవేశాలు, రిపోర్టింగ్ గడువు ఇదే
తెలంగాణలో లాసెట్‌, పీజీలాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌లో డిసెంబరు 19న సీట్లను కేటాయించారు. అందుబాటులో ఉన్న 3,447 సీట్లకుగాను 10,375 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకొన్నారు. వీరిలో 3,331 మందికి సీట్లు కేటాయించారు. మొత్తం 96 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 116 సీట్లు మిగిలాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 6,894 సీట్లుండగా 5,912 మంది సీట్లు పొందారు. వీరిలో 3,729 మంది విద్యార్థులు రిపోర్ట్‌ చేశారు. సీట్లు పొందిన వారు డిసెంరబు 23లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Embed widget