అన్వేషించండి

JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు సత్తా, దేశవ్యాప్తంగా 23 మందికి 100 పర్సంటైల్, ఇందులో 10 మంది మనవారే

జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించగా.. ఇందులో 10 మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం.

JEE Main 2024 Session1 Toppers: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరి 13న ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ముఖ్యంగా 100 పర్సంటైల్ సాధించిన 23 మంది విద్యార్థుల్లో తెలంగాణ విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు. తెలంగాణ నుంచి ఏడుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లోఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున; ఢిల్లీ, హర్యానా నుంచి ఇద్దరు చొప్పున; తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు. 

ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్ పేపర్ -1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించగా.. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండటం విశేషం. వీరిలో ఇందులో, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు. 

తెలుగు రాష్ట్రాల టాపర్లు వీరే..

➥ తెలంగాణ నుంచి రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, మూతవరపు అనూప్, హందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేశ్ రెడ్డి 300లకు 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్‌ పొందారు. 

➥ ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి 100 పర్సంటైల్ స్కోరు సాధించారు.

జేఈఈ మెయిన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ మెయిన్ ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి..

* 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రాలవారీగా

➥ తెలంగాణ - 7 

➥ హర్యానా - 2

➥ ఆంధ్రప్రదేశ్ - 3

➥ తమిళనాడు - 1

➥ ఢిల్లీ - 2

➥ మహారాష్ట్ర - 3

➥ రాజస్థాన్ - 3

➥ గుజరాత్-1

కర్ణాటక - 1

JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు సత్తా, దేశవ్యాప్తంగా 23 మందికి 100 పర్సంటైల్, ఇందులో 10 మంది మనవారే

జేఈఈ మెయిన్-2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం (ఫిబ్రవరి 13న) ఉదయం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు  తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా తెలుసుకోవచ్చు. 

6 ప్రశ్నలు తొలగింపు..
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్-1 తుది కీని ఎన్‌టీఏ ఫిబ్రవరి 12న మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించారు.

జేఈఈ మెయిన్ చివరి విడత (సెషన్-2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నారు. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్చి 2న అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్  ప్లానింగ్ (బీప్లానింగ్) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.

ఇక జేఈఈ మెయిన్ సెషన్‌-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 2న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే  రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

JEE (Main) - 2023 Notification

Eligibility Criteria

Online Application

Official Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget