అన్వేషించండి

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

జేఈఈ మెయిన్-2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం (ఫిబ్రవరి 13న) ఉదయం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్-2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం (ఫిబ్రవరి 13న) ఉదయం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు  తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా తెలుసుకోవచ్చు. 

6 ప్రశ్నలు తొలగింపు..
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్-1 తుది కీని ఎన్‌టీఏ ఫిబ్రవరి 12న మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించారు.

జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 పైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

చివరి విడత (సెషన్-2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నారు. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్చి 2న అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్  ప్లానింగ్ (బీప్లానింగ్) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.

ఇక జేఈఈ మెయిన్ సెషన్‌-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 2న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే  రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నారు. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్‌ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ తెలిపింది. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు. 

జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది రెండు విడతలకు కలిపి 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

అర్హతలు..

➥ బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తోపాట కెమిస్ట్రీ/బయాలజీ/బయోటెక్నాలజీ/ సాంకేతిక వృత్తిపరమైన సబ్జెక్టుల్లో ఏదైనా  కలిగి ఉండాలి. 

➥ బీఆర్క్ కోర్సలకు ప్రవేశాలు కోరేవారు ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆప్షనల్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.  (లేదా) పదో తరగతితోపాటు మూడేళ్ల డిప్లొమా (మ్యాథమెటిక్స్) ఉండాలి.

➥ ఇక బీప్లానింగ్‌కు తప్పనిసరి సబ్జెక్టుతోపాటు గణితం కూడా ఉండాలి.

➥ ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం ఉండాాలి.

JEE (Main) - 2023 Notification

Eligibility Criteria

Online Application

Official Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Viral News: ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
Embed widget