అన్వేషించండి

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌‌-2024లో పెరిగిన కటాఫ్ మార్కులు, ఏడేళ్లలో ఇదే అత్యధికం - ప్రవేశాల్లో తెలుగు రాష్ట్రాల్లే టాప్!

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. టాప్-100లో మద్రాస్ రీజియన్‌లో 25 మంది ఉండగా.. అందులో తెలుగు విద్యార్థులే 20 మంది ఉండటం విశేషం.

JEE Advanced 2024 Cutoff Marks: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలు జూన్ 9న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. టాప్-10లో ఏకంగా నాలుగు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు, టాప్-100లో మద్రాస్ రీజియన్‌లో 25 మంది ఉండగా.. అందులో తెలుగు విద్యార్థులే 20 మంది ఉండటం విశేషం. ఇక టాప్-500 ర్యాంకుల్లో మద్రాస్ రీజియన్‌ నుంచి 145 మంది అర్హత సాధించగా.. అందులో తెలుగు విద్యార్థులు 100 మంది వరకు ఉన్నారు. మొత్తంగా చూస్తే.. మద్రాస్ జోన్‌లో కౌన్సెలింగ్‌కు అర్హత పొందిన మొత్తం 11,180 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు 7 వేల నుంచి 8 వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో ఏటా 18-20 శాతం మంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. 

జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

టాప్-10లో నలుగురు..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాల్లో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భోగలపల్లి సందేశ్ 360 మార్కులకు 338 సాధించి 3వ ర్యాంకు సాధించాడు. అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్‌కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలుకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకులో నిలిచారు. వీరిలో భోగలపల్లి సందేశ్, పుట్టి కుశాల్ కుమార్, సిద్విక్ సుహాస్‌ హైదరాబాద్‌లోనే చదువుతున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 టాపర్ల వివరాల కోసం క్లిక్ చేయండి..

పెరిగిన కటాఫ్ మార్కులు... 
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 కటాఫ్ మార్కులను ఈసారి పెంచారు. 2017 తర్వాత అత్యధిక కటాఫ్ నిర్ణయించడం ఇదే తొలిసారు. 2017లో 366 మార్కులకు 128ని కటాఫ్‌గా నిర్ణయించారు. ఈసారి కటా‌ఫ్‌ను జనరల్ కేటిగిరీకి 109గా నిర్ణయించారు. ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 98 మార్కులు; ఎస్సీ, ఎస్టీలకు 54 మార్కులుగా నిర్ణయించారు. 2021లో కటాఫ్ మార్కులను జనరల్ కేటగిరీకి 63 మార్కులు, 2022లో 55 మార్కులు, 2023లో 86 మార్కులుగా నిర్ణయించారు. 

కౌన్సెలింగ్‌కు 48,248 మంది అర్హత..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలకు సంబంధించి మొత్తం మొత్తం 1,80,200 మంది హాజరుకాగా.. 48,248 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 27 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 40,284 మంది బాలురు ఉండగా.. 7,964 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,43,637 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 40,284 అర్హత సాధించారు. ఇక పరీక్షకు 42,947 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా..41,020 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,964 మంది మాత్రమే అర్హత సాధించారు. గతేడాది మొత్తం 43,773 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 

జోసా రిజిస్ట్రేషన్ ప్రారంభం..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంయుక్తంగా నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 10న ప్రారంభమైంది. మొత్తం 5 విడతల కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇక జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 10 నుంచి జులై 23 వరకు మొత్తం 44 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్‌ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈసారి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. గతేడాది 114 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget