JEE Advanced 2022 Registration: నేటితో జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తుకు ఆఖరు, ఈ సమయం వరకే అవకాశం!
వాస్తవానికి ఆగస్టు 11తో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఒకరోజు పెంచి ఆగస్టు 12 వరకు పొడిగించారు. షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు గడువు ఆగస్టు 12తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థలు రాత్రి 8 గంటలకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 8న ప్రారంభించిన సంగతి తెలిసిందే.
జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆగస్టు 11తో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఒకరోజు పెంచి ఆగస్టు 12 వరకు పొడిగించారు.
షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల తర్వాత ఆగస్టు 8 నుంచి అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు.
అర్హతలు ఇవే..
✪ జేఈఈ మెయిన్స్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అన్ని విభాగాల అభ్యర్థుల నుంచి 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఎంపికచేస్తారు.
✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షకు 01.10.1997 తర్వాత జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. వీరు 01.10.1992 తర్వాత జన్మించినవారై ఉండాలి.
✪ అభ్యర్థులకు వరుసగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షలకు 2022 లేదా 2021 సంవత్సరాల్లో ఇంటర్ పాసై.. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
✪ అయితే 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఫలితాలను 2020, అక్టోబరు 15 తర్వాత ప్రకటించినట్లయితే.. 2020లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు వివరాలు..
✪ మహిళా అభ్యర్థులు (ఇండియా): రూ.1400.
✪ మిగతా అభ్యర్థులందరికీ: రూ.2800.
✪ ఇండియాలో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6000.
✪ ఇండియాలో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6,000.
✪ ఇతర దేశాల్లో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (నాన్ - సార్క్ దేశాలు): రూ.12,000.
ముఖ్యమైన తేదీలు..
✪ జేఈఈ అడ్వా్న్స్డ్ రిజిస్ట్రేషన్: 08.08.2022 - 11.08.2022.
✪ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.08.2022.
✪ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: 23.08.2022 - 28.08.2022.
✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష తేది: 28.08.2022.
పరీక్ష సమయం:
పేపర్-1: ఉ. 9.00 గం. - మ.12:00 గం. వరకు.
పేపర్-2: మ.14:30 - సా.17:30 గం. వరకు.
✪ ప్రాథమిక కీ: 03.09.2022.
✪ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 - 04.09.2022.
✪ తుది ఆన్సర్ కీ: 11.09.2022.
✪ ఫలితాల వెల్లడి: 11.09.2022.
* ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2022
✪ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 11.09.2022 - 12.09.2022.
✪ జాయింట్ సీట్ అలొకేషన్ ప్రారంభం (JoSAA): 12.09.2022.
✪ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: 14.09.2022.
✪ ఫలితాల వెల్లడి: 17.09.2022
JEE (Advanced)-2022: Information Brochure
JEE (Advanced)-2022: Online Registration Portal