అన్వేషించండి

Yuvika Applications: ఇస్రో ‘యువ విజ్ఞాని’కి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, వీరు మాత్రమే అర్హులు

ISRO: విద్యార్థుల్లో అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కోసం ‘యువ విజ్ఞాని’ (Yuvika) కార్యక్రమానికి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో దరఖాస్తులు కోరుతోంది.

ISRO YUVIKA Programme 2025: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (Yuvika) కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. శ్రీహరికోటతో పాటు... డెహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌), తిరువనంతపురం (కేరళ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్‌ (గుజరాత్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), షిల్లాంగ్‌ (మేఘాలయ)లోని కేంద్రాల్లో ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. విద్యార్థులు మార్చి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 7న ప్రకటించనున్నారు. ఎంపికైన విద్యార్థులు సంబంధిత ఇస్రో కేంద్రాల్లో మే 18లోగా చేరాల్సి ఉంటుంది. మే 19 నుంచి 30 వరకు యువికా-25 కార్యక్రమం నిర్వహించనున్నారు. వీరికి ఇస్రో గెస్ట్ హౌజ్ లేదా హాస్టళ్లలో వసతి సౌకర్యాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, కోర్స్ మెటీరియల్, వసతి ఖర్చులన్నీ ఇస్రోనే భరిస్తుంది. 

ఈ కార్యక్రమంలో అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. మే 31న ముగింపు వేడుక నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. విద్యార్థి దశలోనే విజ్ఞానం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌) అంశాలపై అవగాహన కల్పించి, తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించటమే ఇస్రో లక్ష్యంగా కొనసాగుతోంది. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటారు. ల్యాబ్ విజిట్స్ ఉంటాయి. నిపుణులతో చర్చావేదికల్లో పాల్గొనొచ్చు. ఇస్రో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 080 2217 2269 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు.

వీరు అర్హులు..

➥2025 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

➥ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం, గ్రామీణ విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. 

➥ ఆన్‌లైన్‌ క్విజ్‌... జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రతిభ చూపితే పది శాతం చొప్పున; క్రీడలు, ఒలింపియాడ్‌, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగాల్లో ఉంటే 5 శాతం చొప్పున  ప్రాధాన్యం లభిస్తుంది.

దరఖాస్తు ఇలా..

➥  యువికా 2025 కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు కొన్ని అవసరమైన స్టె్ప్స్ పాటించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

➥ ఈమెయిల్ ద్వారా యువికా-2025కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

➥ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లోపు సూచనలను చదివి ఆన్‌లైన్ క్విజ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

➥ క్విజ్ సమర్పించిన తర్వాత, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించడానికి యువికా పోర్టల్‌లోకి లాగిన్ అయ్యే ముందు కనీసం 60 నిమిషాలు వేచి ఉండాల్సి ఉంటుంది. సమర్పించిన ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

➥ రిజిస్ట్రేషన్ గడువుకు ముందే ఫారమ్ యొక్క సంతకం చేసిన కాపీని, అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.

WEBSITE

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rameswaram Road Accident: తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
Prabhas : బాహుబలికి రాజమౌళి లెటర్ - డార్లింగ్ ఇప్పటికే నీకు తెలిసింది కదా...
బాహుబలికి రాజమౌళి లెటర్ - డార్లింగ్ ఇప్పటికే నీకు తెలిసింది కదా...

వీడియోలు

Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
Putin on oil trade with India | చమురు వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్ | ABP Desam
Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rameswaram Road Accident: తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
Prabhas : బాహుబలికి రాజమౌళి లెటర్ - డార్లింగ్ ఇప్పటికే నీకు తెలిసింది కదా...
బాహుబలికి రాజమౌళి లెటర్ - డార్లింగ్ ఇప్పటికే నీకు తెలిసింది కదా...
IndiGo Flight Cancellation : ఇండిగో చేసిన తప్పు- హనీమూన్ ప్లాన్ రద్దు; ఈ జంట కష్టం మామూలుగా లేదు!
ఇండిగో చేసిన తప్పు- హనీమూన్ ప్లాన్ రద్దు; ఈ జంట కష్టం మామూలుగా లేదు!
Indigo Crisis:ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
Sasirekha Song Promo : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో - సరికొత్తగా మెగాస్టార్, నయన్
శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో - సరికొత్తగా మెగాస్టార్, నయన్
Akhanda 2 Release Date : సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?
సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?
Embed widget