IIST: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివే!
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), జనవరి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), జనవరి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీతో గేట్ అర్హత లేదా సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు యూజీసీ-సీఎస్‌ఐఆర్‌నెట్/జెస్ట్/గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రోగ్రాం వివరాలు:
* ఐఐఎస్‌టీ పీహెచ్‌డీ ప్రోగ్రాం- జనవరి 2024
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్/ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ. (లేదా) కనీసం 75 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోరు సాధించి ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ- సీఎస్‌ఐఆర్ నెట్-జేఆర్‌ఎఫ్/ లెక్చర్‌షిప్, ఎన్‌బీహెచ్‌ఎం/ జెస్ట్/ గేట్ స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 31.10.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.350.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు…
➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31.10.2023.
➥ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 08.11.2023.
➥ ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 16.11.2023.
➥ పరీక్ష ఫలితాల వెల్లడి: 22.11.2023.
➥ ఇంటర్వ్యూ తేదీలు: 05.12.2023 నుంచి 08.12.2023 వరకు
➥ ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 14.12.2023.
ALSO READ:
డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్' తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
దేశంలో 'ఇండియా స్కిల్ రిపోర్ట్ (ఐసెఆర్)-2022' నివేదిక ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు 2020లో 45.97 శాతం ఉండగా.. 2021 నాటికి 46.2 శాతానికి చేరింది. అది మొత్తం 2023 నాటికి 60.62 శాతానికి వచ్చి చేరింది. విద్యార్థి దశనుంచే ఉపాధి మార్గంవైపు మళ్లించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీ ఇంటర్న్‌షిప్ రెండు రకాలుగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
యూనివర్సిటీలకు యూజీసీ కీలక ఆదేశాలు, ఆ వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాల్సిందే!
దేశంలోని యూనివర్సీటీలు, కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థలన్నీ ఇకపై తమ వెబ్‌సైట్‌లలో ఫీజులు, రిఫండ్ పాలసీ, హాస్టల్ వసతులు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్, ర్యాంకింగ్స్, అక్రిడిటేషన్ వంటి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకతను పెంచేలా, విద్యార్థులు తప్పుదోవపట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు తమ వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా ఉంచాల్సిన కంటెంట్‌కు సంబంధించి ఓ చెక్ లిస్ట్‌ను విడుదల చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..