అన్వేషించండి

CAT 2022 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

నవంబరు 27న పరీక్ష నిర్వహణఆగస్టు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంసెప్టెంబరు 14 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశంఅక్టోబరు 27న అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) ప్రవేశాలకు ఏటా నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(CAT-2022) నోటిఫికేషన్‌ను ఐఐఎం-బెంగళూరు విడుదల చేసింది. దీనిద్వారా దేశంలోని 20 ఐఐఎంలలో ప్రవేశాలు కల్పించనున్నారు.

ఈ ఏడాది నవంబరు 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 150 నగరాల్లో CAT-2022 పరీక్ష నిర్వహించనున్నారు.  ఆగస్టు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబరు 27 నుంచి పరీక్ష రోజు వరకు అడ్మిట్ కార్డులు(హాల్‌టికెట్లు) అందుబాటులో ఉండనున్నాయి.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఏవైనా ఆరు నగరాలను ప్రాధాన్యాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాతే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు.

దేశంలోని ఐఐఎంలు: అహ్మదాబాద్, అమృత్‌సర్‌, బెంగళూరు, బోధ్ గయా, కతకత్తా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోతక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్మోర్, తిరుచిరాలపల్లి, ఉదయ్‌పూర్, విశాఖపట్నం.

అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉన్నా అర్హులే). డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష. పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

పరీక్ష ఇలా..

నవంబరు 27న క్యాట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది.  పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తారు. ప్రతిప్రశ్నలకు 3 మార్కులు ఉంటాయి.

 సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్

* సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్

* సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు:  చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

దరఖాస్తు ఫీజు: రూ.2,300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1,150.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  03-08-2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14-0-2022

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 27-10-2022

పరీక్ష తేది: 27-11-2022

ఫలితాల వెల్లడి: 2023, జనవరి రెండోవారంలో.

 

CAT 2022 Advertisement

CAT 2022 Information Bulletin

Selection Process of IIMs

Important CAT 2022 Disclaimers

CAT 2022 Eligibility

CAT 2022 Media Release

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
Ys Jagan : ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
Ys Jagan : ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
Robot Suicide: పని ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న రోబో, ఈ ఉద్యోగాలపై మర మనుషులకూ విసుగొచ్చేస్తోందా!
పని ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న రోబో, ఈ ఉద్యోగాలపై మర మనుషులకూ విసుగొచ్చేస్తోందా!
UK Election Results 2024: రాజకీయాల్లో స్టార్మర్ స్టైలే వేరు, ప్రధానిగానూ అదే మార్క్‌ చూపిస్తారా?
రాజకీయాల్లో స్టార్మర్ స్టైలే వేరు, ప్రధానిగానూ అదే మార్క్‌ చూపిస్తారా?
Dhoomam Telugu OTT: ధూమం తెలుగు డిజిటల్ ప్రీమియర్ - థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ సినిమా
ధూమం తెలుగు డిజిటల్ ప్రీమియర్ - థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ సినిమా
Kalki Bujji: కాకినాడలో ప్రభాస్ 'కల్కి' బుజ్జి - ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదుగా!
కాకినాడలో ప్రభాస్ 'కల్కి' బుజ్జి - ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదుగా!
Embed widget