(Source: ECI/ABP News/ABP Majha)
IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో ‘సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్-2024’ నోటిఫికేషన్ వెల్లడి - స్టైఫండ్ ఎంతంటే?
ఐఐటీ మద్రాస్ 2024 సంవత్సరానికి సంబంధించి ‘సమ్మర్ ఫెలోషిప్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది.
Summer Fellowship Programme 2024 at IIT Madras: ఐఐటీ మద్రాస్ 2024 సంవత్సరానికి సంబంధించి ‘సమ్మర్ ఫెలోషిప్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) మూడో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్ చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. అదేవిధంగా మంచి అకడమిక్ మార్కులతో ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది.
రెండు నెలలపాటు కొనసాగే ఈ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ మే 22న ప్రారంభంకానుంది. జులై 21తో కోర్సు ముగియనున్నట్లు ప్రాథమికంగా వెల్లడించినప్పటికీ.. ఈ షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6 వేలు చొప్పున గరిష్ఠంగా రెండు నెలలపాటు స్టైఫండ్ ఇవ్వనున్నారు. ఐఐటీ విద్యార్థులు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ దరఖాస్తుకు అనర్హులు.
వివరాలు..
* సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్-2024
కోర్సు వ్యవధి: 2 నెలలు
అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) మూడో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్ ప్రోగ్రామ్‌లలో మూడు/ నాలుగో సంవత్సరం చదువుతున్నవారితో పాటు మంచి అకడమిక్ రికార్డు కలిగిన ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విభాగాలు ఇవే..
➥ ఏరోస్పేస్ ఇంజినీరింగ్
➥ అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయో మెడికల్ ఇంజినీరింగ్
➥ బయో టెక్నాలజీ
➥ కెమికల్ ఇంజినీరింగ్
➥ సివిల్ ఇంజినీరింగ్
➥ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
➥ ఇంజినీరింగ్ డిజైన్
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
➥ మెకానికల్ ఇంజినీరింగ్
➥ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ
➥ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్
➥ ఓషన్ ఇంజినీరింగ్
➥ సైన్స్ విభాగంలో పిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్
➥ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
➥ మేనేజ్‌మెంట్ స్టడీస్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
స్టైపెండ్: నెలకు రూ.6000/-
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31-03-2024 (5.00 pm.)
➥ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రారంభం: 22.05.2024.
➥ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ చివరితేది: 21.07.2024.
ALSO READ:
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ - అర్హతలు, ఎంపిక ఇలా
తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ఎస్సీ స్టడీ సర్కిళ్లలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగ పరీక్షలతోపాటు.. బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ పరీక్షల కోసం 5 నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సులో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిగ్రీ అర్హత ఉండి, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి ఉచిత స్టడీ మెటీరియల్ కూడా సమకూరుస్తారు. మరిన్ని వివరాల కోసం 040-23546552 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..