ICAI CA: ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల, ఎగ్జామ్స్ షెడ్యూలు ఇదే
ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల అడ్మిట్‌కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.
CA Admitcards: ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల అడ్మిట్‌కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి 17 వరకు సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో సీఏ ఇంటర్ గ్రూప్-1 పరీక్షలను మే 3, 5, 9 తేదీల్లో; గ్రూప్-2 పరీక్షలను మే 11, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక సీఏ ఫైనల్ గ్రూప్-1 పరీక్షలను మే 2, 4, 8 తేదీల్లో, గ్రూప్-2 పరీక్షలను మే 10, 14, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసస్‌మెంట్ టెస్ట్‌ను మే 14 - 16 మధ్య నిర్వహించనున్నారు.
సీఏ అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల అడ్మిట్‌కార్డుల కోసం అభ్యర్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. eservices.icai.org.
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే "Admit cards for CA Inter/Final May 2024 exams" లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
Step 4: సీఏ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Step 5: స్పష్టత కోసం అడ్మిట్‌కార్డులోని వివరాలను పరిశీలించుకోవాలి.
Step 6: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసకోవాలి.
Step 7: అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకొని, పరీక్ష రోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల షెడ్యూలు..
➥ సీఏ ఇంటర్ గ్రూప్-1: మే 3, 5, 9 తేదీల్లో
➥ సీఏ ఇంటర్ గ్రూప్-2: మే 11, 15, 17 తేదీల్లో
➥ సీఏ ఫైనల్ గ్రూప్-1: మే 2, 4, 8 తేదీల్లో
➥ సీఏ ఫైనల్ గ్రూప్-2: మే 10, 14, 16 తేదీల్లో
➥ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ - అసెస్‌మెంట్ టెస్ట్: మే 14 - 16 మధ్య.
లోక్‌సభ ఎన్నికల తేదీల్లోనే సీఏ పరీక్షలు ఉండటంతో పరీక్షలను 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' వాయిదావేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 16న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి జూన్ 26 వరకు సీఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను మార్చాలని ICAI నిర్ణయించింది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల కొత్త షెడ్యూలును మార్చి 19న వెల్లడించింది.
ఐసీఎస్‌ఐ సీఎస్ రివైజ్డ్ షెడ్యూలు..
ఐసీఎస్‌ఐ సీఎస్ (కంపెనీ సెక్రటరీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా వెల్లడించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1 నుంచి ప్రారంభంకావాల్సిన ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ పరీక్షలు జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు జూన్ 10తో ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే జూన్ 11 - 14 వరకు తేదీలను రిజర్వ్‌లో ఉంచింది. పరీక్షల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థలు మార్చి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.