News
News
X

Hotel Management Course After 12th: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్ అంటే ఆసక్తి ఉందా, అయితే ఈ వివరాలు మీ కోసమే

ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ తీసుకున్న వారైనా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేయవచ్చు.

దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో హోటల్ మేనేజ్‌మెంట్ ఒకటి.

FOLLOW US: 

హోటల్‌ మేనేజ్‌మెంట్..రొటీన్‌కు భిన్నంగా..

"హమ్మయ్య ఎలాగోలా ఇంటర్ పూర్తైపోయింది. కష్టపడి చదివి, పాస్‌ అయిపోయాం" అని తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులంతా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ, ఇప్పటి నుంచే మొదలవుతాయి అసలు కష్టాలు. మన కెరీర్‌ని, లైఫ్‌ని డిసైడ్ చేసే టర్నింగ్ పాయింట్ ఇదే. ఇంటర్మీడియట్ తరవాత మనం ఏ చదువుతాం అనేది తేల్చుకోవటమే చాలా ఇంపార్టెంట్. ఇదే సక్సెస్, ఫెయిల్యూర్‌ని నిర్ణయిస్తాయి. పేరులోనే ఉంది కదా "ఇంటర్మీడియట్" అని. అంతకు ముందు చదువుకున్న వాటికి, ఇకపైన చదువుకునే వాటికి మధ్యలో బ్రిడ్జ్‌ లాంటిదన్నమాట ఈ కోర్స్. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి. అయితే చాలా మంది ఇంటర్ పూర్తవగానే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్    అని మూసలో కొట్టుకుపోతారు. ఈ రొటీన్‌ కోర్సులు కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేద్దామనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్స్ లిస్ట్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ ఒకటి. 

మర్యాద రామన్నలైపోతారు..

చాలా మందికి హోటల్ మేనేజ్‌మెంట్ అంటే చిన్నపాటి చులకన ఉంటుంది. "ఆ ఏముందిలో అందులో, అందరి ముందు చేతులు కట్టుకుని నిలబడాలి, సర్వర్లు, వెయిటర్లుగా పని చేయాలి. అంతేగా" అని అనుకుంటారు. కానీ హోటల్‌ మేనేజ్‌మెంట్ అంటే ఇది మాత్రమే కాదు. ఆతిథ్యం ఇవ్వటం. వచ్చిన వాళ్లను నవ్వుతూ పలకరించటం, ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడటం. ఇలా చాలానే బాధ్యత లుంటాయి. చెప్పాలంటే మర్యాద రామన్నలుగా మారిపోవటం అనమాట. కానీ మర్యాద చేయటం అంత సులువేం కాదుగా. దానికీ ఓ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతినే నేర్పిస్తుంది హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్. 

ఎవరు చేయవచ్చు..? 

గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే జాబ్‌లు కాకుండా ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్‌గా ఉండాలనుకునే వాళ్లు, కాస్త మాటకారితనం, అందరిలో కలిసిపోయే తత్వం ఉన్న వాళ్లు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ ఎంచుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కోర్స్‌లో చేరే ముందే అన్ని అనుమానాలు క్లియర్ చేసుకోవాలి. హోటల్ మేనేజ్‌మెంట్‌ అంటే తక్కువ గ్రేడ్  ఉద్యోగాలు వస్తాయన్న అపోహల నుంచి బయట పడాలి. ఓసారి ఈ కోర్స్‌కున్న డిమాండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపడక మానరు. 

ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకున్న వారైనా సరే, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో చేరవచ్చు. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో జాయిన్ అవచ్చు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కోర్స్‌లో చివరి ఏడాది ఏదైనా ఓ స్పెషలైజేషన్‌ను ఎంచుకునే అవకాశముంటుంది.  బీఎస్‌సీ చేశాక ఉద్యోగంలో చేరాలకునే వాళ్లు వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. లేదంటే ఆ పైన మాస్టర్స్‌ చేయచ్చు. ఎంబీఏ హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్ లాంటి పీజీ కోర్స్‌లు చేసుకోవచ్చు. 

హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్స్ ఎక్కడ చేయాలి..? 

దేశవ్యాప్తంగా పలు కంపెనీలు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్‌లు అందిస్తున్నాయి. కానీ, ది బెస్ట్ ఏంటి అంటే మాత్రం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (IHM)పేరే బాగా వినిపిస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్ రాయటం ద్వారా ఈ కంపెనీలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేయచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (NCHM), 
ఇగ్నోతో కలిసి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుని అందిస్తోంది. ఇందులో చేరాలంటే NCHM-JEE ఎంట్రెన్స్  టెస్ట్ రాయాల్సి ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీ, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ హాస్టిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించినవీ ఉంటాయి. ముందుగానే వీటిపైన కాస్త అవగాహన తెచ్చుకుంటే సులువుగా సమాధానాలు రాయవచ్చు. ఇందులో మంచి స్కోరు సాధిస్తే 75కి పైగా సంస్థల్లో కోర్స్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. వీటిలో కొన్ని IHMలు కూడా ఉన్నాయి. వీటిలో సీటు దొరికిందంటే, ఉపాధి అవకాశాలకు కొదవే ఉండదు. 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో (Hotel Management) టాప్ కాలేజీలు : 
1. దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (IHM), క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ 
2. వెల్‌కమ్ గ్రూప్ గ్రాడ్యుయేట్ స్కూల్‌ ఆఫ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, మణిపాల్ 
3. ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ
4. హైదరాబాద్‌లోని IHM 
5. చెన్నైలోని IHM 
6. లఖ్‌నవూ IHM(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్)

ఉపాధి అవకాశాలు

IHMలో కోర్స్ చేసిన వారికి ఉద్యోగావకాశాలు బాగానే లభిస్తాయి. వీటిలో కోర్స్ చేసే వారిలో చాలా మంది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనే జాబ్ సంపాదిస్తారు. స్పెషలైజేషన్ ఆధారంగా హౌస్‌ కీపింగ్ మేనేజ్‌మెంట్, కిచెన్ మేనేజ్‌మెంట్, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటక సంస్థల్లోనూ అవకాశాలుంటాయి. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్‌లో బాగా పేరొందిన ఒబెరాయ్, పార్క్, తాజ్ లాంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. మొదట్లో రూ.2-3 లక్షల ప్యాకేజీలు వచ్చినా, అనుభవం పెరిగే కొద్దీ మంచి ప్యాకేజీలు లభిస్తాయి. హోటల్ మేనేజర్, కిచెన్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ లాంటివి ఉద్యోగాలు దక్కుతాయి. 

 

 

Published at : 28 Jun 2022 11:24 AM (IST) Tags: Hotel Management After Intermediate Hotel Management in India Hotel Management Course Details

సంబంధిత కథనాలు

NTR Health University:  పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!

CUET UG Exam: విద్యార్థులకు అలర్ట్ - ఆ 11 వేల మందికి ఆగస్టు 30న పరీక్ష!

CUET UG Exam: విద్యార్థులకు అలర్ట్ - ఆ 11 వేల మందికి ఆగస్టు 30న  పరీక్ష!

TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!

TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!

CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన