అన్వేషించండి

School Holidays: విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు, ఎపుడంటే?

School Holidays In Telangana: రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరుసగా మరో మూడు రోజులు పాటు సెలవులు రానునున్నాయి.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

School Holidays In Andhra Pradesh: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానునున్నాయి. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం మహాశివరాత్రి (Mahashivratri) ఈ సంవత్సరం మార్చి8వ తేదీన వస్తోంది. అయితే మహాశివరాత్రిని ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు జరుపుకుంటారు. అయితే ప్రతిసంవత్సరం ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మొదటి రోజు మాత్రమే శివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తాయి. ఈ సారి కూడ మార్చి 8వ తేదీ ఒక్కరోజు సెలవు ప్రకటించినా, ఆ రోజు శుక్రవారం కావడం తర్వాతి రోజు సెకండ్ శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలువులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ మూడు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసింది.  

మహాశివరాత్రి అనగా..
ప్రతీ చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి, మార్చ్‌లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. హిందువులు జరుపుకొనే పండుగలలో మహాశివరాత్రి ముఖ్యమైన పండుగ. ఈ రోజు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. ఈ పండుగ రోజున ప్రధానంగా బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తారు. ఈ రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది.  దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి వివిధ రంగాలలో నుంచి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది.

మార్చిలో మరో రెండు సెలవులు..
ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం మార్చి నెలలో మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులు ప్రకటించారు. అయితే మార్చి 23 శనివారం, 24 ఆదివారం, 25న హోలీ దీంతో పాటు మార్చి 26, 27, 28 సెలవు పెట్టుకుంటే 29న గుడ్ ఫ్రైడే, 30 శనివారం, 31 ఆదివారం సెలవులు కాబట్టి మీరు మొత్తం 9 రోజుల పాటు సెలవులను సద్వినియోగం చేసుకోవచ్చు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవరి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవులు రానున్నాయి. అంతేకాకుండా జూన్17వ తేదీన బక్రీద్ సందర్భంగా సెలవు రానుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget