AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల
Higher Education Institutions Reopen: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి ఉన్నత విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఉమ్మడి అకడమిక్ కేలండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఉన్నత విద్యా సంస్థలను అక్టోబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉమ్మడి అకడమిక్ కేలండర్‌ను ఖరారు చేసింది. వారానికి 6 రోజులు తరగతులు జరగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర (ఉన్నత విద్యా శాఖ) ఉత్తర్వులు విడుదల చేశారు. ఏదైనా కారణంతో ఒక రోజు తరగతులు జరగకపోతే వాటిని రెండో శనివారం, ఆదివారం లేదా ఇతర సెలవు దినాల్లో నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ 19 దృష్ట్యా సరి, బేసి విధానంలో అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేశారు. కోవిడ్‌కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నాన్ ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్ (బేసి సెమిస్టర్లు)
1, 3, 5 సెమిస్టర్ల తరగతులు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక 1, 3, 5 సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2022 జనవరి 22న తరగతుల ముగింపు ఉంటుందని చెప్పారు. సెమిస్టర్ పరీక్షలను 2022 జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
నాన్ ప్రొఫెషనల్ కోర్సులు (సరి సెమిస్టర్లు)
2, 4, 6 సెమిస్టర్ల తరగతులను 2022 ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 4 నుంచి 9వ తేదీ వరకు ఇంటర్నెల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 2022 మే 28వ తేదీతో తరగతులు ముగియనున్నాయి. 2022 జూన్ 1 నుంచి 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి. 2వ సెమిస్టర్ పరీక్షల అనంతరం 8 వారాల పాటు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు ఉంటుంది. 4వ సెమిస్టర్ తరువాత 8 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్/ అప్రెంటిస్‌షిప్/ జాబ్ ట్రైనింగ్ ఉండనుంది. తదుపరి విద్యా సంవత్సరం 2022 ఆగస్టు 9వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది.
పీజీ కోర్సులకు నవంబరు 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 2,4,6 సెమిస్టర్ తరగతులు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ముగింపు పరీక్షలను జూలై 4వ తేదీన నిర్వహించనున్నారు.
Also Read: EAPCET Results 2021: నేడు ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే
Also Read: SDLCE (KU): ఇంటి వద్ద ఉండి చదవాలనుకుంటున్నారా.. కాకతీయ యూనివర్సిటీ మీకో గోల్డెన్ ఛాన్స్..