ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
ఏపీలో ఒంటి పూట బడుల విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఏప్రిల్ 3 నుంచి ఒక పూటే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఒంటి పూట బడులు, పదోతరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఏప్రిల్ 3 నుంచి ఒక పూటే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7.30 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ పాఠశాలలు నడుస్తాయని చెప్పారు.
మరోవైపు ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి చెప్పారు. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని..ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలోనే పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదోతరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు. గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్ వెనక్కి తీసుకున్నామని. ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని బొత్స అన్నారు.
ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ టీచర్లు మాత్రమే వ్యవహరించనున్నారు. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాల్ని ఇన్విజిలేటర్లు సైతం తీసుకెళ్లకూడదు. పరీక్షల నిర్వహణకు 800 స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధుల కోసం తాగునీటి సదుపాయం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు..
కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. మరోవైపు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి.
మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి..
ఏపీ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
పరీక్షల షెడ్యూలు ఇలా..
పరీక్ష తేదీ | పేపరు |
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 8 | ఇంగ్లిష్ |
ఏప్రిల్ 10 | మ్యాథమెటిక్స్ |
ఏప్రిల్ 13 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 15 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 17 | కాంపోజిట్ కోర్సు |
ఏప్రిల్ 18 | ఒకేషనల్ కోర్సు |
Also Read:
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!
ఏపీలోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయం బాలికల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కేజీబీవీ పాఠశాలల్లో 2023 - 2024 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సరైన అర్హతలు గల బాలికలు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పరీక్ష షెడ్యూలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్-2 నిర్వహించనున్నారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఏప్రిల్ చివరివారంలో వెల్లడించే అవకాశం ఉంది. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, బీఎస్, బీఆర్క్, ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..