అన్వేషించండి

TS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే?

తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది.

Half Day Schools in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. ఉద‌యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వ‌ర‌కు బ‌డులు నిర్వహిస్తారు.  ఈ మేరకు పాఠశాలలకు ఒంటిపూట బ‌డుల‌పై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ మూడోవారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యా హ్నం 12.30 గంటలకు అందజేస్తారు. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

అలాగే.. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా విద్యాశాఖ హాఫ్ డేస్ ప్రకటించింది. మార్చి  15 నుంచి  ఈ విద్యా సంవత్సవంలో చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొంది.

ALSO READ:

టీఎస్ పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల ప్రారంభంకాలేదు. ఫిబ్రవరి 28 నుంచి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.300 తత్కాల్ ఫీజు కింద ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడాది మే 17న టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ ఏడాది మే 17న టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: polycet-te@telangana.gov.in లేదా 040 -23222192 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 

పాలిసెట్‌-2024 ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
TGPSC Group1 Results: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP DesamGT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
TGPSC Group1 Results: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Happy Ugadi  Shubh Muhurat 2025: ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
Happy Ugadi Wishes in Telugu 2025: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
Telugu TV Movies Today: చిరు ‘ఠాగూర్’, బాలయ్య ‘లెజెండ్’ టు వెంకీ ‘సైంధవ్’, మహేష్ ‘గుంటూరు కారం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 30) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరు ‘ఠాగూర్’, బాలయ్య ‘లెజెండ్’ టు వెంకీ ‘సైంధవ్’, మహేష్ ‘గుంటూరు కారం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 30) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Ugadi Pachadi : ఉగాది పచ్చడి తయారీ రెసిపీ.. ఈ ట్రెడీషనల్​ డిష్​లోని పోషకాలు ఇవే, ఎన్ని కేలరీలు ఉంటాయో తెలుసా?
ఉగాది పచ్చడి తయారీ రెసిపీ.. ఈ ట్రెడీషనల్​ డిష్​లోని పోషకాలు ఇవే, ఎన్ని కేలరీలు ఉంటాయో తెలుసా?
Embed widget