GATE - 2025: గేట్-2025 పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే
GATE-2025 పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ మార్చి 19న విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.

GATE 2025 Results: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025 పరీక్ష ఫలితాలు మార్చి 19న విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఐఐటీ రూర్కీ ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.
గేట్ స్కోరు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.
బ్రాంచ్లవారీగా కటాఫ్ మార్కులు ఇలా..
GATE Paper Code Qualifying GATE Cutoff |
General |
OBCNCL/EWS |
SC/ST/PWD |
Aerospace Engineering |
34.3 |
28.9 |
23.1 |
Agricultural Engineering |
26 |
23.5 |
17 |
Architecture and Planning |
42.5 |
38.3 |
28.6 |
Civil Engineering |
29.3 |
26.4 |
19.8 |
Chemical Engineering |
26 |
23.5 |
17.6 |
Computer Science and IT |
27.6
|
24.8 |
18.4 |
Chemistry |
25.2
|
22.6 |
16.7 |
Data Science and AI |
37.1 |
33.3 |
24.7 |
ECE |
25 |
22.5 |
17.3 |
Electrical Engineering |
25.7 |
23.1 |
17.1 |
Environmental Science and Engineering |
37.9 |
34.1 |
25.2 |
Ecology and Evolution |
35.8 |
32.2 |
23.8 |
Geomatics Engineering |
41.1 |
36.9 |
27.4 |
Geology and Geophysics (Geology) |
42 |
37.8 |
28 |
Geology and Geophysics (Geophysics) |
49 |
44.1 |
32.6 |
Instrumentation Engineering |
32.7 |
29.4 |
21.8 |
Mathematics |
25 |
22.5 |
16.6 |
Mechanical Engineering |
28.6
|
25.7 |
19 |
Mining Engineering |
26
|
23.5 |
17.6 |
Metallurgical Engineering |
42 |
37.9 |
28.3 |
Naval Architecture and Marine Engineering |
26.1 |
23.5 |
17.7 |
Petroleum Engineering |
42.6 |
38.3 |
28.4 |
Physics |
33 |
29.8 |
22.3 |
Production and Industrial Engineering |
31.5 |
28.4 |
21.3 |
Statistics |
26.6 |
23.9
|
17.7 |
Textile Engineering and Fibre Science |
28.1 |
25.2 |
18.7 |
Engineering Sciences |
37.2 |
33.5 |
25.1 |
Humanities and Social Sciences (Economics) |
37 |
33.3 |
24.6 |
Humanities and Social Sciences (English) |
48 |
43.2 |
32 |
Sciences (Philosophy) |
39.3 |
35.3 |
26.1 |
Humanities and Social Sciences (Psychology) |
52.7 |
47.4 |
35.1 |
Humanities and Social Sciences (Sociology) |
36
|
32.4 |
24 |
Life Sciences |
29.3 |
26.3 |
19.5 |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

