అన్వేషించండి

GATE 2023: రేపటితో 'గేట్' దరఖాస్తు 'క్లోజ్', వెంటనే దరఖాస్తు చేసుకోండి!

గేట్ పరీక్ష కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.500 అపరాధ రుసుముతో అక్టోబరు 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

గేట్-2023 రిజిస్ట్రేషన్ గడువు అక్టోబరు 14తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు ముగిసేలోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ.500 అపరాధ రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాస్తవానికి సెప్టెంబరు 30తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. అక్టోబరు 7వరకు పొడిగించారు. అపరాధ రుసుముతో అక్టోబరు 14 వరకు అవకాశం కల్పించారు.

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ చదవాలన్నా, నేరుగా పీహెచ్‌డీ చేయాలన్నా.. 'గేట్' అర్హత ఉండాల్సిందే. గేట్‌లో వచ్చే స్కోరు ఆధారంగానే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఐఐటీ కాన్పూర్ జులై 27న 'గేట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గేట్-2023 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయిన, చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


Also Read: EAMCET Counselling: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!

గేట్-2023 పరీక్షలను 2023లో ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు.  మార్చి 16న ఫలితాలను వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబరు 30 వరకు ఉన్న దరఖాస్తు గడువును అక్టోబరు 7 వరకు పొడిగించారు. ఆలస్య రుసుముతో అక్టోబరు 14 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు.

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

 

Also Read: BPCL: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు, వీరికి అవకాశం!

అర్హతలు..
✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్కిటెక్చర్).
✦ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ.
✦ మాస్టర్ డిగ్రీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్).
✦ నాలుగేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా?

✦ గేట్ పరీక్షకు దరఖాస్తు చేయగోరువారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
✦ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వీటి ద్వారా గేట్‌కు సంబంధించిన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
✦ దరఖాస్తు సమయంలో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్ స్కాన్ కాపీలు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
✦ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఐడీ ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజీ ఐడీ, ఎంప్లాయ్ ఐడీకార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి.

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాగులు, మహిళా అభ్యర్థులు రూ.850 (ఆలస్య రుసుముతో రూ.1350) చెల్లించాల్సి ఉంటుంది.
  • జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.1700 (ఆలస్య రుసుముతో రూ.2200) చెల్లించాల్సి ఉంటుంది.
  • ఢాకా, ఖాఠ్మండ్ దేశాల అభ్యర్థులు 100 యూఎస్ డాలర్లు, ఆలస్య రుసుముతో 150 యూఎస్ డాలర్లు చెల్లించాలి.
  • దుబాయి, సింగపూర్ దేశాల అభ్యర్థులు 200 యూఎస్ డాలర్లు 250 యూఎస్ డాలర్లు చెల్లించాలి.


పరీక్ష ఎలా ఉంటుంది
?


✦ మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.

✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.


Also Read: DOT: టెలికమ్యూనికేషన్ శాఖలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలు ఉండాలి!


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, హైదరాబాద్, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.


ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం                      :           30.08.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది                                 :           30.09.2022. (07.10.2022 వరకు పొడిగింపు)

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఎక్స్ టెండెడ్)        :          07.10.2022. (14.10.2022 వరకు పొడిగింపు)

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్                                               :           03.01.2023.

అభ్యర్థుల రెస్పాన్స్-అప్లికేషన్ పోర్టల్                       :           15.02.2023.

ఆన్సర్ కీ అందుబాటులో                                          :           21.02.2023.

ఆన్సర్ కీ పై అభ్యంతరాల సమర్పణ                       :           22 - 25.02.2023.

గేట్ పరీక్ష తేదీలు 2020                                            :           ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో.

ఫలితాల వెల్లడి                                                        :           16.03.2023.

గేట్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్                                         :           22.03.2023.

 

GATE - 2023 NOTIFICATION

INFORMATION BROCHURE

FEE DETAILS

GATE 2023 PAPERS & SYLLABUS

QUESTION PATTERN

WEBSITE

 

Also Read:

EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ‌2022-2023 విద్యా సంవత్సరానికి వివిద విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?

విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు. 
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
PMKVY: సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
Embed widget