అన్వేషించండి

CUET (PG) - 2024: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET-PG-2024)‌ నోటిఫికేషన్ వెలువడింది.

NTA CUCET PG 2024: దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET-PG-2024)‌ నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 26న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. సీయూటీ పీజీ ప్రవేశ పరీక్షను మార్చి 11 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా 324 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగనుంది. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది.  

ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా దాదాపు 344 పీజీ కోర్సులతో పాటుగా 271 రీసెర్చ్ ప్రోగ్రాంలలో ప్రవేశం పొందొచ్చు. సీయూఈటీ పీజీ పరీక్షను ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియంతో పాటుగా అన్ని రాష్ట్రాల స్థానిక భాషల్లో నిర్వహిస్తున్నారు. సీయూఈటీ పీజీ-2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలు కల్పిస్తారు.

వివరాలు..

* సీయూఈటీ పీజీ - 2024

అర్హత, వయసు: అభ్యర్థులు 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు.. 

CUET (PG) - 2024: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం:

➥ సీయూఈటీ పీజీ పరీక్షను 105 నిమిషాలపాటు సీబీటీ ఆధారంగా నిర్వహిస్తారు. మొత్తం 75 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సిలబస్ అభ్యర్థి ఎంపిక చేసుకున్న పేపర్ కోడ్ ఆధారంగా మారుతుంటాయి.

➥ సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు మూడు సెషన్ల చెప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 10.45 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.15 గంటల వరకు మూడోసెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరుకోవాల్సి ఉంటుంది.

➥ ఎగ్జామ్ డిగ్రీ సిలబస్ ఆధారితంగా ఉంటుంది. స్థానిక భాషలో పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయిస్తారు.

➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందుగానే చేరుకోవాలి. పరీక్ష ఆరంభానికి అరగంట ముందుగానే అభ్యర్థులు హాల్‌టికెట్ల పరిశీలన, పరీక్ష హాల్, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, వ్యక్తిగత హాజరు తదితర ప్రక్రియను పూర్తిచేస్తారు. పరీక్షకు 10 నిమిషాల ముందు పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలను లాగిన్ అయి చూసుకోవచ్చు.

CUET (PG) - 2024: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా! 

తెలగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు...

➥ తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

➥ ఆంధ్రప్రదేశ్: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.01.2024. (11.50 PM)

➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరితేది: 25.01.2024. (11.50 PM)

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 27.01.2024 - 29.01.2024 వరకు.

➥  అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్: 04.03.2024.

➥ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 07.03.2024.

➥ పరీక్ష తేది: 11.03.2024 - 28.03.2024.

➥ ఆన్సర్ కీ వెల్లడి: 04.04.2024.

Notification

Online Application

Website

CUET (PG) - 2024: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget