అన్వేషించండి

CBSE CTET 2024: సీటెట్‌-2024 'ఎగ్జామ్ సెంటర్' వివరాలు అందుబాటులో, పరీక్ష ఎప్పుడంటే?

CTET Exam City: సీటెట్-2024 జులై సెషన్‌కు సంబంధించిన పరీక్ష కేంద్రం వివరాలను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచింది.

CTET 2024 Exam City Intimation Slip: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జులై-2024 సెషన్‌కు సంబంధించి అభ్యర్థుల పరీక్ష కేంద్రం (City Intimation Slip) వివరాలను సీబీఎస్‌ఈ జూన్ 24న విడుదల చేసింది. సీటెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 7న సీటెట్(కంప్యూటర్ ఆధారిత) పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. 

సీటెట్ పరీక్ష కేంద్రం వివరాల కోసం క్లిక్ చేయండి..

✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జులై 2024

✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

పరీక్ష విధానం..

✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): ఒకటి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు.

✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): ఆరు నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్)- జులై 2024 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మార్చి 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు (జనవరి, జులై) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. సీటెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7న ప్రారంభంకాగా.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget