CIPET Admissions: సీపెట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు, ఈ అర్హతలుండాలి!
హైదరాబాద్ చర్లపల్లిలోని 'జాతీయ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ సాంకేతికత సంస్థ' 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది
హైదరాబాద్ చర్లపల్లిలోని 'జాతీయ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ సాంకేతికత సంస్థ' 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో నేరుగా ప్రవేశాలకోసం జూన్ 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణత గల వారు మెకానికల్ డిప్లొమాలో, బీఎస్సీ విద్యార్హత గల వారు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం సంప్రదించాలని సంస్థ డైరెక్టర్, ప్రిన్సిపల్ బి.శ్రీనివాసులు సూచించారు. ఇంటర్ విద్యార్హత గల వారికి నేరుగా డిప్లొమా రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి గలవారు 9677256436, 8093140230 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కోర్సుల వివరాలు..
1) పీజీ డిప్లొమా
విభాగం: ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ & టెస్టింగ్
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
2) పోస్ట్ డిప్లొమా
విభాగం: ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ క్యాడ్/క్యామ్.
కోర్సు వ్యవధి: 1.5 సంవత్సరాలు.
అర్హత: డిప్లొమా (మెకానికల్/ప్లాస్టిక్స్/పాలిమర్/టూల్/ప్రొడక్షన్/మెకాట్రోనిక్స్/ఆటోమొబైల్/టూల్ & డై మేకింగ్/పెట్రోకెమికల్స్/ఇండస్ట్రియల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/టెక్నాలజీ లేదా డీపీఎంటీ/డీపీటీ లేదా తత్సమాన) ఉత్తీర్ణత ఉండాలి.
3) డిప్లొమా
విభాగాలు: ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ.
కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.
ALSO READ:
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు - వివరాలు ఇలా!
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial