అన్వేషించండి

CBSE Supplementary Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును జూన్ 7న విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 15 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

CBSE Supplementary Exams Date Sheet: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ 7న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 15 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పదోతరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన బీసీసీఐ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 15న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 12వ తరగతి సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..

CBSE Supplementary Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..

CBSE Supplementary Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
CBSE Supplementary Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 2.12లక్షల మందికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 47,983 మంది 95శాతానికి పైగా స్కోరు సాధించారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.75 శాతం, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30 శాతం, బెంగళూరులో 99.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 0.48 శాతం పెరుగుదల  నమోదైంది.   బాలుర కంటే బాలికలు 2.04 శాతం పాయింట్లతో పైచేయి సాధించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలోల్ల మొత్తం 87.98 శాతం ఉత్తీర్ణ సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 91.52. కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 85.12 శాతంగా ఉంది. బాలుర కంటే 6.40 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 0.65 శాతం పెరుగదల నమోదైంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 16,33,730 విద్యార్థులు దరఖాస్తు​ చేసుకోగా వీరిలో 16,21,224 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 14,26,420 మంది ఉత్తీర్ణులయ్యారు.​ 12వ తరగతిలో మొత్తం 87.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 91.52 శాతం ఉత్తీర్ణత సాధించగా, 85.12 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16 లక్షల మంది విద్యార్థులకు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు రాగా.. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోరు సాధించడం విశేషం. ఫలితాల్లో అత్యధికంగా తిరువనంతపురం-99.91%, విజయవాడ-99.04%, చెన్నై-98.47%, బెంగళూరు-96.95% ఉత్తీర్ణత సాధించారు. 

వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు పరీక్షలు..
సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకురానుంది. ఇందులో భాగంగా ఏడాదికి రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు  నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది (2025-26 విద్యాసంవత్సరం) నుంచి అమలు చేయనున్నారు. దీనికనుగుణంగా సెమిస్టర్‌ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కసరత్తు చేస్తోంది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించే విధంగా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ నిమగ్నమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget