CBSE: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డా.సన్యం భరద్వాజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత స్కూల్స్ వివరాలతో లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేటు అభ్యర్థులు నిర్ణీత లింక్ మీద క్లిక్ చేసి తమ వివరాలను సమర్పించడం ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 22 వరకు సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ఇప్పటివరకు కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును 'సప్లిమెంటరీ'గా మార్చిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ విద్యార్థుల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ప్రైవేట్ విద్యార్థుల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి...
10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
ALSO READ:
Good Study Habits: చదివింది ఒంటబట్టాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి!
కొంత మంది తెగ చదివేస్తుంటారు. ఎప్పుడూ చూసినా పుస్తకం పట్టుకునే కనిపిస్తారు. కానీ అసలు టైమ్ వచ్చే సరికి ఏదీ గుర్తుండదు. పరీక్షల్లో రాసే ముందు ఏదీ గుర్తుకు రాక తలలు పట్టుకుంటారు. చదువు కోసం వెచ్చించిన సమయం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఇంకొంత మంది ఉంటారు.. వాళ్లు ఎప్పుడూ చదివినట్లు అనిపించదు. పుస్తకం పట్టుకున్నట్లు కూడా పెద్దగా కనిపించరు. కానీ పరీక్షల్లో బాగానే రాస్తారు, ఏదైనా అడిగినా సమాధానం చెబుతారు. ఇలా చాలా మందికి అవుతుంది. ఇలా అవడం చాలా మంది గమనించే ఉంటారు కూడా. అయితే దానికి కారణాలు లేకపోలేదు. ఎంత సేపు చదివామన్నది ఎప్పుడూ ముఖ్యం కాదు. ఎంత ఏకాగ్రతతో, నాణ్యంగా చదివామన్నదే ముఖ్యం. కొద్ది సేపు చదివినా పూర్తి ఏకాగ్రతతో, అదే ధ్యాసతో చదివితే చక్కగా గుర్తుండిపోతాయి. అసలు ఎలా చదవాలి, చదివింది కాసేపే అయినా చక్కగా గుర్తుండాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి.
1. వాస్తవ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి. ఒక్కసారి కూర్చొని చదవడం మొదలు పెడితే అన్ని సబ్జెక్టులు ఒకేసారి పూర్తి చేయాలని అనుకోవద్దు. చదవాల్సిన విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఒక్కో దాన్ని పూర్తి చేస్తూ వెళ్లాలి.
2. ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి
పడగ్గది, లైబ్రేరీ, స్టడీ రూమ్, టెర్రస్, బాల్కనీ ఇలా ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. అంతరాయం కలిగించని చోట కూర్చొని పూర్తి ఏకాగ్రతతో చదవాలి.
3. బ్రేక్ తీసుకోవాలి
చదువుతుంంటే అదే పనిగా ఎక్కువ సేపు కూర్చోవద్దు. తరచూ బ్రేకులు తీసుకోవాలి. అలా కాసేపు లేచి అటు ఇటు తిరగాలి. అలా చేయడం వల్ల రిఫ్రెష్ గా ఉంటుంది. తిరిగి ఏకాగ్రతగా చదవడానికి వీలవుతుంది.
4. తగినంతగా నిద్ర పోవాలి
బాగా విశ్రాంతి తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. రోజూ 7-8 గంటల పాటు నిద్రపోతే శరీరానికి, మనస్సుకు విశ్రాంతి లభించి తిరిగి శక్తిని పుంజుకుంటుంది.
5. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి
ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినాలి. దీని వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభించి శరీరం, మనస్సు యాక్టివ్ గా ఉంటాయి. ఫ్రైడ్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్లు, మసాలా ఫుడ్స్ లాంటివి తినడం వల్ల వాటిని జీర్ణం చేసుకోవడానికే శరీరం శక్తిని వెచ్చిస్తుంది.
6. ప్లాన్ చేసుకోవాలి
ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, అసైన్ మెంట్లు ఎప్పుడు పూర్తి చేయాలి లాంటి వాటికి సమయం కేటాయించుకోవాలి. అలాగే ఏది ముఖ్యమో గుర్తించి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.
7. ఇతరులతో కలిసి చదువుకోవాలి
స్నేహితులు, క్లాస్‌మేట్స్, ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకేదైనా డౌట్ వచ్చినా, వారికేదైనా డౌట్ వచ్చినా దాని వల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది. సబ్జెక్ట్ పై చర్చించడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి.
8. రాయడం ప్రాక్టీస్ చేయాలి
చదివింది పేపర్ పై రాయడం మొదలు పెట్టడం వల్ల ఆ సబ్జెక్టు మీకెంత అర్థం అయింది, ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది, ఏయే అంశాలు గుర్తుండటం లేదో తెలుస్తుంది.
9. సహాయం తీసుకోవాలి
అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి. ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ లేదా లెక్చరర్ల సహాయం తీసుకోవాలి. ఏదైనా అర్థం కాని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి.
10. మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోవాలి
మీరు పెట్టుకున్న లక్ష్యాలను అందుకుంటే మీకు మీరు తప్పకుండా రివార్డ్ ఇచ్చుకోవాలి. వాటి వల్ల మరింత ఉత్సాహం లభిస్తుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial