అన్వేషించండి

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సర్వం సిద్ధం, హాజరుకానున్న 38 లక్షల మంది విద్యార్థులు!

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు  ప్రారంభంకానున్నాయి.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు  ప్రారంభంకానున్నాయి. పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై మార్చి 21 వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5 వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  

కాగా.. 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షలను మార్చి 27నే నిర్వహించనున్నారు. కేవలం ఒకరోజు జరిగే పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. 12వ తరగతి మిగతా పరీక్షలు, పదోతరగతి పరీక్షల షెడ్యూల్ డిసెంబరు 29న ప్రకటించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.

పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

➥ ఈసారి సీబీఎస్ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 38,83,710 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 10వ తరగతి పరీక్షలకు 21,86,940 మంది అభ్యర్థులు, 12వ తరగతి పరీక్షలకు 16,96,770 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 

➥ పదోతరగతి పరీక్షలకు 9 లక్షల 39 వేల 566 మంది బాలికలు హాజరుకానుండగా.. 12 లక్షల 47 వేల 364 మంది బాలురు హాజరవుతున్నారు. ఇతరులు 10 మంది ఉన్నారు.

➥12వ తరగతి పరీక్షలకు 7 లక్షల 45 వేల 433 మంది బాలికలు, 9 లక్షల 51 వేల 332 మంది బాలురు హాజరుకానున్నారు. ఇతరులు ఐదుగురు ఉన్నారు.

➥ పదోతరగతి పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 24,491 పాఠశాలల పరిధిలో 7240 పరీక్ష కేంద్రాలను, 12వ తరగతి పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 16,738 పాఠశాలల పరిధిలో 6759 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సర్వం సిద్ధం, హాజరుకానున్న 38 లక్షల మంది విద్యార్థులు!

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇప్పటికే విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత పాఠశాలల నుంచి పొందవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేటు విద్యార్థుల అడ్మిట్ కార్డులను కూడా సీబీఎస్‌ఈ విడుదల చేసింది.

హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

* హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.-  cbse.gov.in.

* అక్కడ హోంపేజీలో కనిపించే 'Main website' టాబ్ మీద క్లిక్ చేయాలి.

* క్లిక్ చేయగానే వచ్చే పేజీలో సీబీఎస్‌ఈ క్లాస్-10, 12 పరీక్షల హాల్‌టికెట్లకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

* విద్యార్థులు తమ వివరాలు నమోదుచేయగానే పరీక్ష హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

* హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని పరీక్షల సమయంలో వెంటతీసుకెళ్లాలి. 

Website

Download Admit Card for Private Candidates Board Examination 2023 (Main) 

Also Read:

KNRUHS: ఆయూష్‌ పీజీ వైద్యసీట్ల భర్తీకి వన్‌టైం వెబ్‌ఆప్షన్లు, షెడ్యూలు ఇదే!
రాష్ట్రంలోని ఆయూష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యూనానీ కోర్సులో కన్వీనర్‌ కోటా సీట్లను ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్ల కేటాయింపులు జరపనున్నారు. 
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget