CBSE: సీబీఎస్ఈలో డిజిటల్ చెల్లింపులు.. ఐపీఎస్ విధానం అమలు..
సీబీఎస్ఈ చెల్లింపుల కోసం ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ అనే విధానాన్ని ప్రారంభించింది. సీబీఎస్ఈ దాని అనుబంధ స్కూళ్ల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపుల కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఫీజుల చెల్లింపులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానాన్ని డిజిటల్ రూపంలోకి మార్చింది. ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (IPS) అనే విధానం ద్వారా డిజిటల్ పేమెంట్లను తీసుకొచ్చింది. దీని ద్వారా సీబీఎస్ఈ దాని అనుబంధ స్కూళ్ల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపులను డిజిటల్ విధానంలో చేయవచ్చు. మాన్యువల్ విధానంలో చెల్లింపుల వల్ల సమయం వృధా అవుతున్నట్లు గుర్తించామని.. అందుకే ఐపీఎస్ తెచ్చినట్లు సీబీఎస్ఈ అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీఎస్ విధానానికి సంబంధించి సీబీఎస్‌ఈ అధికారిక ప్రకటన జారీ చేసింది.
సీబీఎస్ఈ పరిధిలో ప్రస్తుతం 10 లక్షల మంది అధ్యాపకులు, 10 వేల మంది ప్రిన్సిపాళ్లు ఉన్నారు. వీరు కాకుండా ఇతర సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మాన్యువల్‌గా జరిగే లోపాలను నివారించేందుకు సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ విధానంలో చెల్లింపులు పూర్తి డిజిటల్ విధానంలో ఉంటాయి. ఫలితంగా మాన్యువల్ జోక్యం ఉండదు. సీబీఎస్‌ఈ సిబ్బందికి, స్కూళ్లను తనిఖీ చేసిన వారికి గౌరవ వేతనం కూడా ఆన్‌లైన్ విధానంలో చెల్లిస్తారు. టీఏ/డీఏ వంటివి కూడా సంబంధిత సిబ్బంది బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.38,500 సాయం..
పీడబ్ల్యూడీ విద్యార్థుల కోసం..
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం (Children with Special Needs) సీబీఎస్ఈ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో (2020 ఫిబ్రవరి 14) జారీ చేసిన సర్క్యులర్‌కు ఇది కొనసాగింపని బోర్డు తెలిపింది. బోర్డు దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలుకు కట్టుబడి ఉందని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
Also Read: అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలంటే పీహెచ్‌డీ మస్ట్... ఎప్పటి నుంచి అమలంటే...!
నవంబర్‌లో సీబీఎస్ఈ టర్మ్ 1 పరీక్షలు..
ప్రస్తుత విద్యా సంవత్సరం (2021–22) నుంచి 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను సెమిస్టర్ విధానంలో నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఈ తరగతులకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలను నిర్వహించనుంది. ప్రతి టర్మ్ లో సగం (50 శాతం) సిలబస్ కవర్ చేస్తుంది. టర్మ్ 1 పరీక్షలు నవంబర్‌లో.. టర్మ్ 2 పరీక్షలను మార్చి–ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం.. సీబీఎస్ఈ 10, 12 తరగతుల టర్మ్ 1 పరీక్షలు వచ్చే నెలలో జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు.
Also Read: ఏపీ స్కూళ్లలో 2024 కల్లా సీబీఎస్‌ఈ అఫిలియేషన్.. అసలేంటీ విధానం?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి