News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CBSE Affiliation: ఏపీ స్కూళ్లలో 2024 కల్లా సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌.. అసలేంటీ విధానం?

ఏపీలో 2024 కల్లా అన్ని స్కూళ్లలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అఫిలియేషన్ పొందడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసలేంటీ సీబీఎస్ఈ విధానం?

FOLLOW US: 
Share:

ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఆమోదం పొందాలని.. 2024 నాటికి విద్యార్థులంతా సీబీఎస్ఈ పరీక్షలు రాసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఆట స్థలాలు ఉండాలని సూచించారు. ప్లే గ్రౌండ్‌ లేని స్కూళ్లను మ్యాప్ చేయాలని.. వాటికి కావాల్సిన భూములను సేకరించి ఆ స్కూళ్లకు ప్లే గ్రౌండ్‌ కేటాయించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీబీఎస్ఈ విద్యా విధానం ప్రవేశ పెట్టనుండటంతో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ మధ్య వ్యత్యాసాలను తెలుసుకుందాం. 

Also Read: డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌.. ఏడాదికి రూ.50,000 సాయం.. ప్రగతి ప్రోగ్రామ్ వివరాలివే..

స్టేట్ సిల‌బ‌స్ విధానం..
స్టేట్ బోర్డులో ప్రాంతీయ భాష, సంస్కృతి, రాష్ట్ర స్థాయి అంశాల‌కు అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. రాష్ట్ర బోర్డులు తమ సిలబస్, పాఠ్యాంశాలను చాలా అరుదుగా మారుస్తుంటాయి (అప్‌డేట్). దీనిలోని సిలబస్ విధానం రాష్ట్ర ప‌రిధికి మాత్రమే పరిమితం అవుతుంది. స్టేట్ బోర్డు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో ఇంగ్లిష్, ఇతర ప్రాంతీయ భాషల్లో విద్యను బోధిస్తారు. ప్రాక్టిక‌ల్ ఇంప్లికేష‌న్ అంశాలను ప్రధానంగా బోధిస్తారు. స్టేట్ సిలబస్ విధానంలో టెన్త్ క్లాసుకు సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (SSC).. ఇంట‌ర్మీడియెట్ (12వ తరగతి)కు విడిగా ఇంట‌ర్ బోర్డు నుంచి స‌ర్టిఫికెట్ అందిస్తారు. 

Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం.. 

సీబీఎస్ఈ సిలబస్ విధానం..
కేంద్ర ప్రభుత్వ పాఠశాలలన్నీ సీబీఎస్ఈ మార్గదర్శకాలను అనుసరించాలి. ఈ విధానంలో గణితం, సైన్స్ అప్లికేషన్ ఆధారిత సబ్జెక్టులపై మెయిన్ ఫోకస్ ఉంటుంది. అన్ని సబ్జెక్టులలో శాస్త్రీయ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తారు. సిలబస్, పాఠ్యాంశాలను సిలబస్‌ని తరచుగా (దాదాపు ప్రతి ఏటా) అప్‌డేట్ చేస్తారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో విద్యను బోధిస్తారు. సీబీఎస్ఈ విధానంలో ప‌దో త‌రగ‌తికి (క్లాస్ X) ఆలిండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ (AISSE) సర్టిఫికెట్ అందిస్తారు. ఇక ఇంట‌ర్‌కు (క్లాస్ XII) ఆలిండియా సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (AISSCE) ఇస్తారు. 

Also Read: నీట్ యూజీ దరఖాస్తు సవరణ గడువు పొడిగింపు.. రేపటి వరకు ఛాన్స్..

కోవిడ్ తర్వాత పరిస్థితులపై సీఎం చర్చ..
ఏపీలో కోవిడ్ తీవ్రత తగ్గిన అనంతరం పాఠశాలలను పున:ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా తర్వాత స్కూళ్లలో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల హాజరు వంటి పలు అంశాలపై సీఎం ఆరా తీశారు. విద్యా కానుక, అమ్మ ఒడి పథకాల గురించి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం అమలుపై పలు అంశాలను ప్రస్తావించారు.

Also Read: ఏపీ నిట్‌లో ఎంబీఏ కోర్సు.. అక్టోబర్ 30తో ముగియనున్న దరఖాస్తు గడువు.. ముఖ్యమైన వివరాలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Oct 2021 04:03 PM (IST) Tags: AP Cm Jagan AP Education CBSE Affiliation in AP schools CBSE Affiliation State Vs CBSE Syllabus State Vs CBSE

ఇవి కూడా చూడండి

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

టాప్ స్టోరీస్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

ABP-CVoter Snap Poll: మహిళా రిజర్వేషన్లపై సామాన్యుల రియాక్షన్‌ ఇదే- ఏబీపీ సీఓటర్‌ సర్వే ఫలితాలు

ABP-CVoter Snap Poll: మహిళా రిజర్వేషన్లపై సామాన్యుల రియాక్షన్‌ ఇదే- ఏబీపీ సీఓటర్‌ సర్వే ఫలితాలు