CAT 2022 Admit Card: 'క్యాట్-2022' హాల్‌టికెట్లు ఈ తేదీ నుంచే! ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి!!
క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు అక్టోబరు 27న సాయంత్రం 5 గంటల నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం నవంబరు 27న CAT 2022 పరీక్ష నిర్వహించునున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బెంగళూరు క్యాట్-2022 నవంబరు పరీక్ష హాల్‌టికెట్లను అక్టోబరు 27 విడుదల చేయనుంది. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు అక్టోబరు 27న సాయంత్రం 5 గంటల నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం నవంబరు 27న CAT 2022 పరీక్ష నిర్వహించునున్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
CAT 2022 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌చేసుకోవాలి..
➦ CAT 202 అడ్మిట్ కార్డు (హాల్‌టికెట్) కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.- iimcat.ac.in
➦ అభ్యర్థి తన వివరాలతో సైన్ ఇన్ కావాలి.
➦ అక్కడ 'Download CAT 2022 Admit Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
➦ క్లిక్ చేయగానే అభ్యర్థి హాల్‌టికెట్ వస్తుంది.
➦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
➦ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
➦ అక్టోబరు 27న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
అడ్మిట్ కార్డుల కోసం వెబ్‌సైట్: https://iimcat.ac.in
పరీక్ష విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు 13 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. క్యాంట్ స్కోరుకు 2023 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ - 24 ప్రశ్నలు – 72 మార్కులు
* సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు
* సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు – 60 మార్కులు.
క్యాట్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-08-2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14-0-2022
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 27-10-2022
పరీక్ష తేది: 27-11-2022
ఫలితాల వెల్లడి: జనవరి-2023 రెండోవారంలో.
:: ఇవీ చదవండి ::
DOST Counselling: 'దోస్త్' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!
ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
AISSEE-2023: సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..