ప్యాంటు వేసుకున్నప్పుడల్లా గుర్రం గుర్తుకొస్తుంది- నవ్వు కూడా వస్తుంది!
ప్యాంట్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కామన్ వస్త్రం. అసలు దీని పుట్టుక చాలా ఆసక్తిని కలిగి ఉంటుంది.
పురాతన కాలంలో రాజులు యుద్ధాలు చేయడానికి సైన్యాలను పోషించేవాళ్లు. అందులో గుర్రాలపై వెళ్లి యుద్ధం చేసే అశ్వశ్రేణి ఉండేది. మిగతా వాళ్లతో పోలిస్తే యుద్ధంలో వీరి పాత్ర చాలా ముఖ్యం. అయితే సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రపు స్వారీ చేస్తూ శత్రువులపై ఆయుధాలు సంధించడం... వారితో యుద్ధం చేయడం సైనికులకు చాలా ఇబ్బందిగా ఉండేది.
గుర్రంపై స్వారీ చేసే సైనికులు సంప్రదాయ దుస్తులు ధరించడానికి అసౌకర్యంగా ఉన్నందున ప్యాంటును మొదట కనుగొన్నారు. తర్వాత లెక్కలు చూస్తే... ఇలా ప్యాంటు ధరించే వారు యుద్ధ నైపుణ్యాన్ని ఎక్కువ ప్రదర్శించేవాళ్లు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన వారిపై ప్యాంటు ధరించే సైనికులదే పైచేయిగా ఉండేది. ఈ కారణంగా చాలా దేశాలు, రాజ్యాలు ఈ ప్యాంటును అడాప్ట్ చేసుకున్నాయి.
ఆరో శతాబ్దపులో గ్రీకు ప్రజలు ఈ ప్యాంటు మొదట తయారు చేసినట్టు చరిత్ర చెబుతోంది. వారు పెర్షియన్, తూర్పు, మధ్య ఆసియా వైపు గుర్రపు స్వారీలు చేసేవాళ్లు. అలా గుర్రంపై ఎక్కువ కాలంపాటు వారు ఉండటం వల్ల ప్యాంటు వాళ్లకు సౌకర్యవంతంగా ఉండేది. అందుకే దాన్ని తమ సంప్రదాయ దుస్తుల్లో ఒకటిగా చేసుకున్నారు.
ఆధునిక గ్రీకు ప్రజలు ప్యాంటును తమకు సౌకర్యవంతంగా ఉంటుందని భావించినప్పటికీ.. పురాతన గ్రీకులు మాత్రం దీన్ని తప్పుపట్టారు. దానిని 'తులకోస్' అంటే బ్యాగ్స్ అని ముద్దుపేరు పెట్టారు'. రోమన్లు కూడా ప్యాంట్లను తిరస్కరించారు. అనాగరికులు ధరించే వస్త్రాలుగా భావించారు.
ఎవరు ఎలా అనుకున్నప్పటికీ రానురాను ప్యాంటు విశ్వవ్యాప్తమైంది. మంచి ప్రజాదరణ పొందింది. ప్యాంటు వేసుకునేటప్పుడు ఉన్న సౌకర్యాన్ని అందరూ గుర్తించారు. అందుకే ఎవరూ కాదనలేక.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని అనుసరిస్తున్నారు.
ప్రారంభంలో ప్యాంటు సైనిక దుస్తులుగా డిజైన్ చేశారు. చాలా లూజ్‌గా ఉండేది. కింది భాగంలో కుట్టకుండా వదిలేసేవాళ్లు. 14వ శతాబ్దపు చివరిలో మొత్తం కుట్టిన ప్యాంట్‌లు వచ్చాయి. అప్పుడు ప్యాంట్లకు గొట్టం రూపం వచ్చింది.
1500 నాటికి ఎవరికి కావాల్సిన కొలతల్లో వాళ్లు కుట్టించునే ప్యాంట్లు వచ్చాయి. ట్రౌజర్‌లు చాలా పెద్దవిగా ఉండేవాలి. తొడల వద్ద వదులుగా తర్వాత సన్నగా కుట్టించుకునే వాళ్లు. డిఫరెంట్ వస్త్రంతో కుట్టించుకునే వాళ్లు. కింద రంగురంగుల లైనింగ్‌లు చేయించుకునే వాళ్లు.
అప్పట్లో కార్మికులకు వైవిధ్యమైన ప్యాంట్లు ఉండేవి. చీల మండల వద్ద వదులుగా తొడల వద్ద గట్టిగా పట్టిం ఉంచేలా కార్మికులు తమ ప్యాంట్లు కుట్టించుకునే వాళ్లు. ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లు తమ ప్యాంట్లను గొట్టాలు మాదిరిగా కుట్టించుకునే వాళ్లు.
19వ శతాబ్దంలో మాత్రమే ఈ రోజు మనం ధరించే ప్యాంట్ల రూపాన్ని తయారు చేశారు. బటన్స్‌తో చూడముచ్చటైన డిజైన్లతో వచ్చాయి క్వీన్ విక్టోరియా పెద్ద కుమారుడు ఎడ్వర్డ్ VII, నేటి ప్యాంటుకు ట్రెండ్ సెటర్‌గా ఉండేవాళ్లు.
పురాతన కాలంలో ప్యాంట్లను ఎక్కువ మగవాళ్లే ధరించే వాళ్లు. ఒక వేళ మహిళలు ప్యాంటు ధరించినా మోకాళ్ల వరకు భారీ స్కర్ట్‌లు వేసుకునే వాళ్లు. 1880ల నాటికి, పాశ్చాత్య దేశాల్లోని మహిళలు విశ్రాంతి కార్యక్రమాల కోసం ప్యాంటు ధరించడం ప్రారంభించారు. సైకిల్ తొక్కేటప్పుడు, జాగింగ్ టైంలో ప్యాంట్లు ధరించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా మంది స్త్రీలు ప్యాంట్లు ధరిస్తున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంత్లాల్లో ప్యాంట్లు ధరించడంపై ఆంక్షలు ఉన్నాయి.