News
News
X

Virtual School: విద్యా వ్యవ‌స్థలో విప్లవాత్మక మార్పు! దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభం, ప్రత్యేకతలివే!

దేశంలోని ఎక్కడి విద్యార్థి అయినా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్లు కూడా ఆగస్టు 31 నుంచే ప్రారంభయ్యాయి.

FOLLOW US: 

విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో ముందడుగు వేశారు. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను కేజ్రీవాల్ ఆగస్టు 31న ప్రారంభించారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’గా దీనికి పేరు పెట్టారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల‌నే ల‌క్ష్యంతో ఈ వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 


Also Read:   NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!భౌతికంగా పాఠశాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఇదో సదావకాశమని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనుబంధంగా ఈ స్కూల్ కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ స్కూల్ అడ్మిషన్లు కూడా ఆగస్టు 31 నుంచే ప్రారంభయ్యాయి. 9-12వ తరగతి వరకు ప్రవేశ ప్రక్రియ మొదలైంది. దేశంలోని ఎక్కడి విద్యార్థి అయినా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ www.dmvs.ac.in ని సందర్శించడం ద్వారా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని కేజ్రీవాల్ వివరించారు.


Also Read:   NSAT 2022: పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్‌షిప్‌ టెస్ట్, దరఖాస్తు చేసుకోండి!గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళి చదువుకోవడంలో ఇబ్బందులు పడుతున్నార‌నీ, వారు ఈ పాఠ‌శాల‌లో చేరవచ్చని ఆయన అన్నారు. వర్చువల్ స్కూల్‌లో చేరే విద్యార్థులు ఇంటి వద్ద నుంచే లైవ్‌లో పాఠాలు వినవచ్చని చెప్పారు. జేఈఈ, నీట్, సీయూఈటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తాం. పలు కారణాలతో బడికి వెళ్లలేని పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. దేశ విద్యారంగంలోనే దిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ ఓ మైలురాయి అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. 


Also Read:    BRAOU: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ - మార్కెట్‌లోకి అంబేద్కర్‌ వ‌ర్సిటీ స్టడీ మెటీరియల్‌! ధర ఎంతంటే?ఈ దిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్‌లో విద్యార్థులు లైవ్ క్లాస్‌లకు హాజరుకావచ్చు. రికార్డ్ చేసిన తరగతి సెషన్‌లు, స్టడీ మెటీరియల్‌‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆయా సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ఒక్కో విద్యార్థికి ఒక్కో ఐడీ, పాస్‌వర్డ్ ఇవ్వనున్నారు. డిజిటల్ లైబ్రరీ సేవలు కూడా అందుబాటులో ఉంచారు. పార్ట్   టైమ్ ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను కూడా అందించనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.కరోనా సమయంలో నిర్వహించిన వర్చువల్ తరగతుల స్ఫూర్తితోనే ఈ పాఠశాలను ప్రారంభించినట్లు దిల్లీ సీఎం వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లోకి లాగిన్ చేయడం ద్వారా ప్రత్యక్ష,  రికార్డ్ చేయబడిన తరగతులను, మూల్యాంకనాలను యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాట‌న చేస్తున్న పిల్లల కోసం మేము కొత్త ప్రత్యేక పాఠశాలను కూడా ప్రారంభిస్తున్నామ‌నీ, ఇతర ప్రత్యేక కార్యక్రమాలతో నైపుణ్య విశ్వవిద్యాలయాలను ప్రారంభించ‌బోతున్నామ‌ని తెలిపారు.

 

Also Read:

TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2910 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం మరో 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది.  663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని దాటేశామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఇచ్చిన హామీ  మేరకు గడిచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. 
పూర్తి వివరాలు జీవోల కోసం క్లిక్  చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 01 Sep 2022 12:09 AM (IST) Tags: Arvind Kejriwal Virtual School Arvind Kejriwal Inaugurates Virtual School

సంబంధిత కథనాలు

TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

CUET PG Final Key: సీయూఈటీ పీజీ తుది ఆన్సర్ కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

CUET PG Final Key: సీయూఈటీ పీజీ తుది ఆన్సర్ కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

PECET Result: నేడు పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

PECET Result: నేడు పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!

Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!

KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'